రణ్ బీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ `బ్రహ్మాస్త్ర పార్ట్- 1 శివ`. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ పై ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ తో కలిసి ఈ భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామాని నిర్మించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. రిలీజ్ కి ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
బాలీవుడ్ సినీ చరిత్రలోనే నూ. 410 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. హిందీ, తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపించింది. అయితే ముందు నుంచి సినిమాపై పాజిటివ్ టాక్ వుండటంతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబట్టగలిగింది. అంతే కాకుండా ఈ మూవీని రాజమౌళి ప్రమోట్ చేసిన తీరు కూడా ప్లస్ గా మారి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఈ సినిమాకు తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే దక్షిణాదిలో ఈ మూవీ టీమ్ తో కలిసి అగ్రెసీవ్ గా రాజమౌళి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఊహించని విధంగా ఈ మూవీకి భారీ క్రేజ్ ని తీసుకొచ్చారు. అయితే ఇందుకు గానూ రాజమౌళికి కరణ్ జోహార్ రూ. 10 కోట్లు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నీ తూచ్ అని ధర్మా ప్రొడక్షన్స్ తో సన్నిహితంగా వుండే వారు కొట్టి పారేస్తున్నారు. అంతే కాకుండా ఈ వార్తలు మీడియా వల్లే పుట్టుకొస్తున్నాయంటూ మండిపడుతున్నారు.
అంతే కాకుండా `బాహుబలి`కి కరణ్ జోహార్ సహాయం చేస్తే ఇప్పుడు రాజమౌళి .. కరణ్ కు సహాయం చేశాడని అంతే తప్పు ఇద్దరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని, `బాహుబలి` నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, అదే `బ్రహ్మాస్త్ర`కు రాజమౌళి సహాయపడేలా చేసిందని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని `బ్రహ్మాస్త్ర` ప్రమోషన్స్ లోనూ రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే.
తాను రూపొందించిన `బాహుబలి`కి కరణ్ జోహార్ ఎంతో చేశారని, ఆ కారణంగానే తాను `బ్రహ్మాస్త్ర`కు సమర్పకుడిగా సహాయం చేసేందుకు అంగీకరించానన్నారు. ఆ తలరువాతే తనకు అయాన్ ముఖర్జీ కథ వినిపించాడని రాజమౌళి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలి రోజు మిశ్రమ స్పందనని రాబట్టినా ఇప్పటి వరకు అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ గా రూ. 248.97 కోట్లు వసూలు చేయడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.