అమ్మాయి కోసం 20 ఏళ్ల వ‌య‌సులో బిగ్ బీ సాహసం ఇది!

Update: 2022-10-27 15:30 GMT
60 ప్ల‌స్ లో 20 ఏళ్ల నాటి కాలంలోకి తొంగి చూస్తోన్న త‌రుణ‌మిది. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా? ప్ర‌తీ ఒక్క‌రు జీవితంలో మ‌ధుర స్మృతులు త‌ప్ప‌క గుర్తు చేసుకోవాల్సిందే. దాచేద్దాం? అనుకున్నా దాగ‌ని సంద‌ర్భాలంటూ కొన్ని ఉంటాయి.ఆ స‌మ‌యం వ‌స్తే వాటంతట‌వే త‌న్నుకుంటూ బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి 16 ప్రాయంలో త‌న ల‌వ్ స్టోరీని చెప్పుకుని మురిసిపోయారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. కానీ ఏ నాడు ఆపాత కాల‌పు ప్రేమ క‌థ గురించి ఎక్క‌డా చెప్పింది లేదు. తొలిసారి నాగార్జున‌....అమీర్ ఖాన్ నోరు విప్పి అడిగేస‌రికి మెగాస్టార్ సైతం దాచుకోలేక‌పోయారు. త‌న సైకిల్ ల‌వ్ స్టోరీని చెప్పుకొచ్చి అంద‌ర్నీ న‌వ్వించారు. ఆ రోజుల్లో  అమ్మాయి సైకిల్ తొక్కుడికి చిరంజీవి ప్రేమ‌లో ప‌డిపోయారు.

తాజాగా బాలీవుడ్ లెజెండ్ బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ కూడా త‌న 20వ ఏట ప్రేమ‌క‌థ గురించి గుర్తు చేసుకుని మురిసిపోయారు.  అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే విందాం.. `నేను స్కూల్ కి వెళ్లే రోజుల్లో  ఓ అమ్మ‌యి అంటే చాలా ఇష్ట‌ప‌డే వాణ్ణి. అప్ప‌ట్లో హాస్టల్ ఉండేవాడిని. ఆ అమ్మాయి నా సోద‌రి స్కూల్కి ద‌గ్గ‌ర్లో ఆ అమ్మాయి స్కూల్ ఉండేది.

అక్క‌డికి వెళ్లాలంటే? ఓ పెద్ద కంద‌కం లాంటిది దాటి వెళ్లాలి. ఆ అమ్మాయి కోసం రోజు అలా చేసేవాడిని. ఆ స‌మ‌యంలో ఎంత సాహ‌స‌మైనా చేయాల‌నిపించేది. బ‌హుశా అమ్మాయి ప‌వ‌ర్ అలాంటిదేమో` అని బిగ్ బీ నవ్వేసారు. దీంతో నెటి జ‌నులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.  మొత్తానికి అమితాబ్ కూడా వ‌య‌సులో ఉన్న‌ప్పుడు  అల్ల‌రి పిల్ల‌గాడే అంటున్నారు.

అమితాబ్ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ‌ న‌టుడు. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు త‌న పంథాని మార్చుకుంటూ వైవిథ్యమైన పాత్ర‌ల‌తో అల‌రిస్తున్నారు. వ‌య‌సులో ఉన్న‌ప్పుడు ఎంతో మం మ్మాయిల‌కు క‌ల‌ల రాకుమారుడు. సినిమాల్లోకి రాక‌ముందే ఆయ‌న సాధార‌ణ వ్య‌క్తే. కానీ ఇప్పుడ‌దే వ్య‌క్తి అసాధార‌ణమైన శ‌క్తిగా మారారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవితో ఉన్న స్నేహం కార‌ణంగా  సైరా న‌ర‌సింహారెడ్డిలో చిరు గురువు పాత్ర‌లో క‌నిపిచించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News