సోషల్ మీడియా యుగంలో మోసాలు అన్నీ ఇన్నీ కావు. సైబర్ క్రైమ్ ని రెగ్యులర్ గా ఉక్కిరిబిక్కిరి చేసే ఫిర్యాదులు కోకొల్లలు. కొందరు ఆకతాయిలు నేరుగా సెలబ్రిటీల పేరుతో ట్విట్టర్ ఇన్ స్టా వంటి పేజీల్ని తెరిచి అక్కడ సినిమాలకు ప్రమోషన్ కూడా చేసేస్తున్నారు. అయితే ఆ పేజీలన్నీ ఫేక్ అని కనిపెట్టడం కూడా అంత సులువేమీ కాదు.
ఇప్పుడు అలాంటి సన్నివేశమే ఎదురైంది ఉప్పెన హీరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి. పంజా వైష్ణవ్ తేజ్ పేరుతో ఒక ట్విట్టర్ ప్రొఫైల్ ఇటీవల వైరల్ గా మారింది. అతను ఒక నటుడిని అని చెప్పడంతో దానికి చాలామంది ఫాలోవర్స్ యాడయ్యారు. `నెవర్ లూస్ ది కిడ్ ఇన్ యు` అని ఒక ట్యాగ్ లైన్ ట్విట్టర్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. చూస్తుంటే ఇది నిజంగానే మెగా హీరోకి చెందిన నిజమైన ట్విట్టర్ ఖాతా అని భ్రమించేలా ఉంది.
నిజానికి తాను ట్విట్టర్ లో లేనని ఆ ట్విట్టర్ ప్రొఫైల్ తనది కాదని వైష్ణవ్ తాజాగా స్పష్టం చేశారు. దీనిని బట్టి యువ హీరోని తప్పు పట్టించే పనిలో ఉన్నారు సదరు ఆకతాయి. అందుకే `నకిలీ ఖాతాల పట్ల జాగ్రత్త వహించండి` అంటూ వైష్ణవ్ ఒక వివరణను ఇచ్చారు.
ఉప్పెనను డబుల్ బ్లాక్ బస్టర్ చేసినందుకు థాంక్స్ చెబుతూ.. అలాగే జాతిరత్నాలు ట్వీట్ కి స్పందిస్తూ.. అంతా నేనే చేశాను! అన్నట్టుగానే సదరు డమ్మీ వైష్ణవ్ కలరివ్వడంతో అది నిజంగానే అతడేనా? అని సందేహం కలిగింది. వైష్ణవ్ తేజ్ వాటిని ట్వీట్ చేసినట్లుగా అభిమానుల స్పందనలు కూడా కనిపించాయి. ఇవన్నీ చూశాక అతడిదే ఈ ట్విట్టర్ ఖాతా అని నమ్ముతారు. ఇప్పుడు వైష్ణవ్ నేరుగా బరిలో దిగి క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇక ఆ ట్విట్టర్ ని ఎవరూ అనుసరించాల్సిన పనే లేదు. నిజం ఏదీ.. నకిలీ ఏది? అన్నది గుర్తించకుండా వీటిని అనుసరించడం పెద్ద టైమ్ వేస్ట్. పైగా ప్రమాదాలు పొంచి ఉంటాయి. మోసగాళ్ల నుంచి దూరంగా ఉండండి అంటూ వైష్ణవ్ హెచ్చరించారు.