తన తర్వాత హీరోలైన సూర్య - కార్తి తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నా.. తనను మాత్రం ఇక్కడి జనాలు ఆదరించట్లేదేంటని విజయ్ కి చాన్నాళ్ల నుంచే ఫీలింగ్ ఉంది. అందుకే తాను కూడా తెలుగు మార్కెట్ ను కొల్లగొడదామనే కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. తుపాకి - జిల్లా సినిమాలు ఓ మోస్తరుగా ఆడి అతడిలో కొంచెం ఆశలు రేపాయి. ఆ సినిమాలు వేసిన పునాదిపై ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టేద్దామని చూస్తున్నాడు విజయ్.
తమిళ అభిమానులు ఇళయ దళపతి అని ముద్దుగా పిలుచుకునే విజయ్.. తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ‘పులి’ సినిమాతో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా తమిళంతో పాటే తెలుగులో భారీ స్థాయిలో విడుదలవుతోంది.
విజయ్ కి ఈసారి చాలా అంశాలు కలిసొస్తున్నాయి. అతడికి మరీ ఎక్కువ పోటీ లేదు. భారీ సినిమా బరిలో లేదు. రామ్ ‘శివమ్’ మాత్రమే పోటీగా విడుదలవుతోంది. లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చే అంశం. ఇక ‘పులి’లో తెలుగువారికి బాగా పరిచయమున్న నటీనటులే ఉన్నారు. శ్రీదేవి - శ్రుతిహాసన్ - హన్సిక - సుదీప్ - ఆలీ... వీళ్లందరూ ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకులకు ‘పులి’ బాగా కనెక్టయ్యే అవకాశముంది. సినిమాకు సంగీతాన్నందించింది కూడా మన దేవిశ్రీ ప్రసాదే. జానపద చిత్రం కావడం వల్ల కూడా యూనివర్శల్ అప్పీల్ ఉంటుంది. ఇన్ని సానుకూలాంశాల మధ్య అయినా విజయ్ తెలుగు మార్కెట్ ను కొల్లగొడతాడేమో చూడాలి.