ఇట్స్ ఫ్యామిలీ టైం ఫర్ సూర్య..!

Update: 2023-04-02 22:16 GMT
తమిళ స్టార్ హీరో సూర్య తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్య జ్యోతిక ది సూపర్ హిట్ పెయిర్ ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ మీద కూడా వీరిది చూడ చక్కని జంట 2006లో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉండగా హీరోయిన్ గా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన జ్యోతిక రీసెంట్ గా మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

సూర్య జ్యోతికలకు ఇద్దరు పిల్లలు.. మొదట అమ్మాయి పేరు దియా కాగా రెండో సారి అబ్బాయి పుట్టగా దేవ్ అని పేరు పెట్టారు. దియా కి 15 ఏళ్లు రాగా.. దేవ్ కి 12 ఏళ్లు వచ్చాయి. ఆమధ్య ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లిన సూర్య ఫ్యామిలీ.. పిల్లలని మీడియా కవర్ చేస్తుంటే పిల్లలను వదిలేయండి ప్లీజ్ అని సూర్య చెప్పారు.

ఇక లేటెస్ట్ గా వారి ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశారు. లేటెస్ట్ గా ఒక మ్యూజియం ఇనాగరేషన్ ప్రోగ్రాం కి సూర్య జ్యోతికలు అటెండ్ అయ్యారు. తమిళనాడులో కీజాడి మ్యూజియం శివగంగై ఏరియాలో ఇనాగరేట్ చేశారు. ఈ కార్యక్రమానికి సూర్య తన ఫ్యామిలీతో కలిసి వచ్చారు.

ఇక సూర్య పిల్లలని చూస్తే పాప వియా అచ్చం జ్యోతికలానే ఉండగా దేవ్ లిటిల్ సూర్యగా మెరుస్తున్నాడు. సూర్య తన వారసుడిని సినిమాల్లోకి తెస్తాడా లేదా అన్నది మాత్రం తెలియలేదు.

ప్రస్తుతానికి వారిని సినిమా ప్రపంచానికి దూరంగా ఉంచుతున్నారు. వారి సినిమాల ఈవెంట్ కి కూడా సూర్య తన పిల్లలను తీసుకురాడు. సూర్య తమిళంలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం శివ డైరెక్షన్ లో ఒక భారీ పీరియాడికల్ సినిమా చేస్తున్నారు సూర్య. నటించడమే కాదు 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య తో పాటుగా అతని తమ్ముడు కార్తీ కూడా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. సూర్య కార్తీ ఇద్దరికి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News