కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమా తారలు తమ రోజువారీ పనులు, వర్కౌట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య సెలబ్రిటీల వర్కౌట్ వీడియోలపై బాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. సెలబ్రిటీలు ఇలా వర్కౌట్ల వీడియాలను పోస్ట్ చేయడాన్ని కొందరు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యం లో దీపికా పదుకొణె మాత్రం వర్కౌట్ వీడియోలను పోస్ట్ చేయడానికి అనుకూలంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ‘వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పేంటి? ఇలా పోస్ట్ చేయడాన్ని ఈ మధ్య చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేయడం, చేయకపోవడం అనేది పర్సనల్ విషయం. అది మనం ఏమనుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ వీడియోలో మనం ఎలా కనపడతున్నామనే దానిపై కాదు’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది.
‘మనందరం పిల్లలమేం కాదు. ఆలోచించే శక్తి ఉంది. కరోనాను ఎదుర్కొవాలంటే ఏం చేయాలో మనకు తెలుసు. ఇంటి నుంచి కదలకుండా ఉండాలి. అయితే ఇది ఏ ఒక్క రోజో, రెండు రోజులో కాదు.. ఏకంగా 21 రోజులు. మరి రోజు గడవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, ప్రజలపై ఈ లాక్‌డౌన్ మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చాలా మందికి అర్థం కావడంలేదు. ఇలాంటి సమయంలో కొంచెం సంతోషం, పాజిటివ్‌నెస్‌లతో పాటు కొంత ఆరోగ్యాన్ని పంచేందుకు వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేస్తే తప్పేం కాదు’ అని దీపిక క్లారిటీగా చెప్పింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరాఖాన్ కూడా సెలబ్రిటీలు తమ వర్కౌట్స్ వీడియోలను షేర్ చేయడం ఆపాలని, లేని పక్షంలో తను అన్‌ఫాలో అవుతానని ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశారు.