ఉత్తరాది ప్రేక్షకులను మించి తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఆధరిస్తున్నారు. ఆ విషయం బిగ్ బాస్ సీజన్ 4 మరియు సీజన్ 5 లకు వచ్చిన రేటింగ్ ముఖ్యంగా హాట్ స్టార్ లో వచ్చిన వ్యూవర్ షిప్ చెప్పకనే చెబుతోంది. తెలుగు ప్రేక్షకులు ఆ స్థాయిలో బిగ్ బాస్ ను ఆదరిస్తున్నారు కనుక ఓటీటీ ద్వారా తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. హిందీ బిగ్ బాస్ ఓటీటీ వచ్చేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. కాని తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన వెంటనే ఓటీటీ కి సిద్దం అయ్యారు. అంతే కాకుండా హిందీ బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ కేవలం 8 వారాలు మాత్రమే కొనసాగింది.
కాని తెలుగు బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ ను 12 నుండి 15 వారాల పాటు కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. షో కు వచ్చే ఆధరణ బట్టి ఇంకా పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ సందర్బంగా నాగార్జున ఓటీటీ బిగ్ బాస్ ను ప్రకటించాడు. ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకు వస్తామని అన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఫిబ్రవరిలోనే షో ను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే కరోనా థర్డ్ వేవ్ కారణంగా షో ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.
కాని తాజాగా హాట్ స్టార్ మరియు షో నిర్వాహకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి ఆదివారం ఖచ్చితంగా బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు అవ్వబోతుంది. గత బిగ్ బాస్ లతో పోల్చితే ఈ బిగ్ బాస్ చాలా విభిన్నంగా ఉంటుంది. రోజులో 24 గంటలు కూడా కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు అనేది చూడవచ్చు. అంతే కాకుండా గంటన్నర ఎపిసోడ్ కూడా చూడవచ్చు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో చాలా బజ్ వినిపిస్తుంది.
ఎక్కువ శాతం పాత కంటెస్టెంట్స్ ఉంటారని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 నుండి మొదలుకుని సీజన్ 4 వరకు కంటెస్టెంట్స్ గా వ్యవహరించిన కొందరిని ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. వారు బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు. వారికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తి అయ్యాయి.
అంతే కాకుండా వారు ఈనెల 15 నుండి క్వారెంటైన్ కు కూడా వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తో సహా తీసుకుని ఉండాలని కండీషన్ పెట్టారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఆ విషయమై కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ కు సర్వం సిద్దం అయ్యింది. ఆలస్యం చేయకుండా.. అన్న టైమ్ కు అంటే ఫిబ్రవరి చివరి వారంలోనే స్ట్రీమింగ్ మొదలు అవ్వబోతుంది కనుక.. వారు అన్నట్లుగా ఎంటర్ టైన్మెంట్ కూడా పీక్స్ లో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ షో ఖచ్చితంగా మరో లెవల్ అన్నట్లుగా ఉంటుందని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.