సంక్రాంతి సీజన్ లో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో రజనీ- మహేష్- బన్ని లాంటి క్రేజీ స్టార్లు నటించిన సినిమాలున్నాయి. స్టారాధి స్టార్లతో పోటీపడుతూ కళ్యాణ్ రామ్ ఎంతో గట్సీగా బరిలో దిగాడు. సంక్రాంతి పందెంలో బన్ని నటించిన `అల వైకుంఠపురములో` డామినేషన్ స్పష్టంగా కనిపించింది. మాటల మాంత్రికుడి క్లాస్ టచ్ అందరికీ నచ్చింది. ఇక మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` ఓపెనింగుల పరంగా నిరూపించుకుంది. రజనీ దర్బార్ ఫర్వాలేదన్న టాక్ వచ్చింది. ఎంతమంచి వాడవురా రొటీన్ కంటెంట్ తో పోటీలో తేలిపోయింది.
అయితే సంక్రాంతి సినిమాలు చూసినవాళ్లంతా వీటన్నిటికంటే.. డిసెంబర్ లో వచ్చిన `మత్తు వదలరా` బావుంది కానీ ఎందుకు ఆడలేదో! అంటూ పెదవి విరిచేయడం చర్చకొచ్చింది. అంతా కొత్త కుర్రాళ్లు ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన `మత్తు వదలరా` డిసెంబర్ లో రిలీజైంది. ఈ చిత్రం స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం.. పైగా ప్రమోషన్ సరిగా లేకపోవడంతో తేలిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమా విషయంలో అలా జరిగినందుకు బాధపడిన ఆడియెన్ కూడా ఉన్నారు. సంక్రాంతి సినిమాలపై సామాన్య ప్రజల చిట్ చాట్ వ్యూలో తేలిన నిజం ఇది.
అయితే ప్రచారం విలువెంతో తెలిసిన దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈసారి జాను ప్రమోషన్స్ ని ఎలా ప్లాన్ చేశారు అన్నది చూడాలి. ఇప్పటికి కాంటెస్టులు అంటూ ఆన్ లైన్ లో టైమ్ పాస్ చేస్తున్నారు. తాజాగా మై క్లిక్ ఫర్ జాను! అంటూ శర్వా-సమంత జంటతో అభిమానులకు ఫోటోలు దిగే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఫొటో కాంటెస్ట్‌కు జనవరి 31 చివరి రోజు. దీనికి యూత్ నుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి కాంటెస్టులు సినిమాకి ఎంతవరకూ కలిసొస్తాయి? మూల మూలలకు తీసుకెళ్లాలంటే.. కేవలం ఈ ప్రమోషన్ సరిపోతుందా? అంటే సందేహమే. ఇక మత్తువదలరా లాంటి కంటెంట్ ఉన్న సినిమానే విలేజ్ స్థాయి జనాలకు చేరువ చేయలేకపోవడం వైఫల్యంగా భావిస్తే .. జాను విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? అన్న చర్చా సాగుతోంది.
తమిళ బ్లాక్ బస్టర్ 96 కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కంటెంట్ పరంగా రిచ్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే శర్వానంద్ పోస్టర్ కి చక్కని స్పందన వచ్చింది. ఈ చిత్రానికి మాతృక దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. 96కు పనిచేసిన గోవింద్ వసంతన్ జాను కు సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది.