2018 సెన్సేషనల్ తమిళ హిట్ చిత్రం 96. ఈ సినిమా వల్లనే త్రిష కథానాయికగా కంబ్యాక్ అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 పురస్కారాల్ని అందించింది తనకు. ఆ అవార్డ్ షీల్డ్స్ తో ఉన్న త్రిష ఫోటో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో నటించిన విజయ్ సేతుపతికి అంతే పేరొచ్చింది. దర్శకుడిగా సి.ప్రేమ్ కుమార్ పేరు మార్మోగింది. బాక్సాఫీస్ సక్సెస్ తో పాటు క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న చిత్రమిది.
ఆ క్రమంలోనే 96 రీమేక్ హక్కులు చేజిక్కించుకున్న దిల్ రాజు సమంత- శర్వానంద్ జంటగా తెలుగులో రీమేక్ ని స్టార్ట్ చేశారు. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో `జాను` అనే టైటిల్ ని నిర్ణయించారు. షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. ఒక ఎడారిలో ఒకదాని వెంట ఒకటిగా ఒంటెలు నడుచుకుంటూ వస్తున్నాయి. ఆ ఒంటెలను తాడుతో లాగుతున్న ప్రయాణీకుడి గా శర్వా కనిపిస్తున్నాడు. ఎటువంటి సరిహద్దులు .. షరతులు లేని అసలు సిసలైన నివాళి! అంటూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఆసక్తికరం. అంటే హద్దులు ఎల్లలు లేని అద్భుత ప్రేమకథ అనే అర్థం స్ఫురిస్తోంది. ఒక మంచి కథ అభిరుచి ఉన్న దర్శఖ నిర్మాతల చేతికి చిక్కితే అది అంతే అద్భుతం గా తెరకెక్కుతుంది. అయితే జాను విషయంలో మాతృక లో ఉన్న బిగి చెడకుండా తీసారా? అన్నదే ఇంపార్టెంట్. ఇప్పటికే తెలుగులో వచ్చే రీమేక్ లు చాలా వరకూ ఒరిజినల్ ని అభిమానించిన వారి మనసుల్ని గెలవలేకపోతున్నాయి. రీమేక్ లు చెత్తగా తీయడంలో దర్శకులు విఫలమవుతున్నారు. అయితే ప్రేమ్ కుమార్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు ఏమేరకు రీచ్ చేస్తారు? అన్నది చూడాలి.