జబర్‌దస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయిన కమెడియన్.. చంటి.. ఎలియాస్ చలాకీ చంటి. అయితే మనోడు ఈ మధ్యనే ఎక్కడో ప్రభాస్ గురించి ఏవో కామెంట్లు చేశాడని ఒక రూమర్ బయటకొచ్చింది. దానితో కోపోద్రిక్తుడైన ఒక అభిమాని.. మనోడ్ని బండ బూతులు తిడుతూ ఫేస్ బుక్ లో ఒక కామెంట్ పెట్టాడు. దానితో పెద్ద రభసే రాజుకుంది.
అసలు మా హీరో ప్రభాస్ ను తిడతావా అంటూ ఇల్లందు అనే ఊరికి చెందిన 'రాజు' అనే ఫేస్ బుక్ య్యూజర్.. ఏకంగా బూతులు తిడుతూ ఒక పోస్టు పెట్టేశాడు. దానిని అందరూ షేర్ చేస్తూ ఇక చంటికి చుక్కలు చూపించారు. ఏకంగా వాట్సాప్ లో ఒక గ్రూప్ తయారు చేసి అందులో చంటి నెంబర్ ను యాడ్ చేసి మరీ బూతులు తిట్టారట. సెల్ ఆన్ చేస్తే చాలు.. ఈ బూతు మెసేజ్‌లే. చివరకు పోలీసుల సహాయంతో సదరు రాజు అనే వ్యక్తిని పట్టుకున్నాడు చలాకీ చంటి. అతగాడితోనే అసలు విషయంపై క్లారిటీ ఇప్పిస్తూ ఒక వీడియోను కూడా పోస్టు చేయించాడు.
''కళాకారులకు గౌరవం ఇవ్వండి. మేము మనుషలమే. మాకూ మనస్సు ఉంటుంది. సోషల్ నెట్ వర్కులో నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా వైల్డ్ గా ప్రవర్తించకండి'' అంటూ రిక్వెస్టు చేస్తున్నాడు చంటి. నిజమే కదా. సదరు రాజు అనే అభిమాని.. కేవలం ఎక్కడో ఏదో చదివి.. దానిపై అలా బూతులతో కామెంట్ చేసానని.. తనకి చంటి కామెంట్ చేశాడా అనే విషయం తెలియదని చెబుతూ.. ఒక సారీ చెప్పాడు. అది మ్యాటర్.