ఇద్దరు చైనా సూపర్ స్టార్లు దెబ్బకొట్టారు

Update: 2016-08-02 04:52 GMT
తెలుగు రాష్ట్రాలతో పాటు.. మన దేశంలో విడుదలైన ప్రతీ భాషలోను బాహుబలి ది బిగినింగ్ సంచలనాలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పలు భాషల్లో డబ్బింగ్ అయి విజయం సాధించిన బాహుబలి.. ఆగస్ట్ 22న చైనాలోను రిలీజ్ అయింది. ఇక్కడ మాత్రం రాజమౌళి మూవీకి పెద్ద షాక్ తగిలింది. అయితే.. చైనా జనాలకు కంటెంట్ నచ్చకపోవడం కంటే.. ఆ ఇద్దరు కొట్టిన దెబ్బే ఎక్కువగా ఎఫెక్ట్ చూపించింది.

బాహుబలి ది బిగినింగ్ కి చైనాలో 7.5 లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయి. పీకే సాధించిన 19.4 మిలియన్ డాలర్లకు మించి వసూలు చేయాలన్న టార్గెట్ కి దెబ్బపడింది. ఇందుకు ప్రధాన కారణం.. చైనీస్ స్టార్ హీరోలు జాకీ చాన్.. జెట్ లీలు. బాహబలి చైనాలో రిలీజ్ అయిన రోజునే జెట్ లీ నటించిన 'లీగ్' తో పాటు జాకీచాన్ మూవీ 'స్కిప్ ట్రేస్' కూడా విడుదలైంది.  ఈ రెండు సినిమాలు భారీ సక్సెస్ సాధించగా.. బాహుబలి వైపు ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు.

ఎంత కంటెంట్ ఉన్న సినిమా అయినా.. మనకు స్టార్ వాల్యూ ఉన్నా.. అక్కడి బిగ్గెస్ట్ స్టార్స్ అయిన జాకీచాన్.. జెట్ లీ ల ముందు బాహుబలి నిలబడలేకపోయాడు. బాహుబలి ది బిగినింగ్.. చైనీయులను ఆకట్టుకోలేకపోవడం.. మార్కెటింగ్ పరంగా బాహుబలి2 పై ప్రభావం చూపనుంది. మొదటి పార్ట్ కి నష్టాలు రావడంతో రెండో భాగానికి చైనాలో రేటు కూడా పెద్దగా రాకపోవచ్చంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
Tags:    

Similar News