జాకీ జాన్ అంటే యూనివర్శల్ స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఆయన సినిమాలెంత ఆకట్టుకుంటాయో.. ఆయన వ్యక్తిత్వం కూడా అంతగా మెప్పిస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన తన అభిమానులకు మరింతగా చేరువయ్యారు. ఐతే తాను వచ్చిన నేపథ్యమే తనను అంత మర్యాదగా నడుచుకునేలా చేసిందని.. కానీ తన కొడుక్కి మాత్రం తనకు తెలిసిన మర్యాదలు తెలియలేదని.. అతను అమెరికాలో పెరగడం వల్ల చెడిపోయాడని ఓ కార్యక్రమంలో జాకీ చాన్ ఓపెన్ గా చెప్పేయడం విశేషం.
తాను పేద కుటుంబం నుంచి వచ్చానని.. తన తండ్రి తనను చాలా పద్ధతిగా పెంచాడని.. ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడని.. ఇంట్లోకి వస్తే చెప్పులు ఓ మూలన పద్ధతిగా విడవాలని చెప్పేవాడని.. తాను అలాగే చేసేవాడినని.. కానీ అమెరికాలో పెరిగి.. అక్కడి సంస్కృతికి అలవాటు పడిన తన కొడుక్కి ఇలాంటివేమీ పట్టవని.. అతను చెప్పుల్ని ఎలా పడితే అలా విసిరేస్తాడని హావభావాలతో సహా జాకీ వివరించడం విశేషం. తనలా పెద్దల్ని గౌరవించడం కూడా తన కొడుక్కి తెలియదని.. ఎవరైనా వస్తే లేచి వచ్చి గౌరవంగా పలకరించాలన్న సంస్కారం కూడా అతడికి ఉండదని.. ఇలాంటి విషయాల్లో గద్దిద్దామని అనుకున్నా.. ఎక్కడ తిరిగి తన మీద కేసు పెడతాడో అని ఏమీ మాట్లాడకుండా సైలెంటుగా ఉంటున్నానని జాకీ చాన్ చెప్పడం విశేషం. జాకీ కొడుకు జేసీ చాన్ గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని తండ్రికి తలవంపులు తెచ్చిన సంగతి తెలిసిందే.