పేద.. మధ్యతరగతి ప్రజలు థియేటర్లలో ధరలు చూసి బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పట్టణాలు.. నగరాల్లోని థియేటర్లు లేదా మల్టీప్లెక్సుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. సినిమా టికెట్ కంటే కూడా పాప్ కార్న్ వంటి ధరలు అధికంగా ఉంటాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితులు ప్రేక్షకులు వాటిని కొనుగోలు చేయక తప్పడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో థియేటర్లు మూతపడటం.. ఓటీటీ హవా పెరిగిపోయింది. తక్కువ మొత్తంలో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకొని ఇంటిల్లిపాది సినిమాలు చూస్తున్నారు. ఇంట్లోనే పకోడీలు.. మిర్చిలు చేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.
కరోనా తగ్గి పరిస్థితులు మాములైనా ఆడియన్స్ మాత్రం థియేటర్లకు పెద్దగా రావడం లేదు. మునపటిలా సినిమాలను ఒకటి పది సార్లు చూడటం లేదు. మహా అయితే ఒక్కసారి అది కూడా సినిమా బాగుంటేనో లేదంటే తమకు నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయితేనే ప్రేక్షకులు థియేటర్లు వస్తున్నారు.
టికెట్ల రేట్లతో పాటుగా థియేటర్లలోని వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో షూటింగులు నిర్వహించాలని బాలీవుడ్ నటులతో తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ సీఎంను థియేటర్లలో పాప్ కార్న్ రేటు తగ్గించండి సార్ అంటూ వేడుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారి నవ్వారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. సీఎం యోగీ ఆదిత్య నాథ్ తో జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ థియేటర్లలో పాప్ కార్న్ కోసం రూ.500 లు తీసుకుంటున్నారని చెప్పారు. దయచేసి వాటి ధరలను తగ్గించండి.. సినిమా తీస్తున్నాం.. స్టూడియోలు కడుతున్నాం.. కానీ సినిమా టికెట్ కంటే కూడా అక్కడున్న పాక్ కార్న్ ధరలే ఎక్కువగా ఉంటే థియేటర్లకు ఆడియన్స్ ఎలా వస్తారు? అని అడిగారు.
దీంతో అక్కడున్న వారంతా కాసేపు నవ్వుకున్నారు. అయితే జాకీ ష్రాఫ్ అడిగిన దాంట్లో మాత్రం వాస్తవం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులు.. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూసేందుకు థియేటర్లకు రాకపోవడానికి అక్కడ లభించే తినుబండారాల రేట్లు అధికంగా ఉండటం కూడా ఒక కారణమని అంటున్నారు. మరీ ఈ విషయంపై యోగీ ఆదిత్య నాథ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.