తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు అందుకున్న వారిలో సత్యదేవ్ కూడా టాప్ లిస్టులో ఉన్నాడు అనే చెప్పాలి. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో క్యారెక్టర్ మాత్రం చాలా భిన్నంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాడు. పెద్ద సినిమాల్లో కూడా సపోర్టింగ్ పాత్రలు చేసినా కూడా కథలో చాలా ముఖ్యం అనుకుంటేనే నటించడానికి ఒప్పుకుంటాడు. ఇక గత ఐదారేళ్లలో ఈ హీరో నుంచి వచ్చిన సినిమాలు అన్నీ కూడా చాలా ప్రయోగాత్మకంగా తెరకెక్కినవే.
కొన్ని సినిమాలు కమర్షియల్ గా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకున్నాయి. సత్య దేవ్ ఏదైనా కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నాడు అంటే అందులో తప్పకుండా ఏదో కొత్త పాయింట్ హైలెట్ అవుతుంది అని ప్రేక్షకులలో కూడా ఒక నమ్మకం అయితే ఏర్పడింది.
ముఖ్యంగా బ్లాఫ్ మాస్టర్ అయితే మంచి ప్రశంసలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ సినిమా చూసి చిత్ర యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు తోనే సత్యదేవ గాడ్సే అనే సినిమా చేశాడు. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు. అయితే థియేటర్ లోకి రాక ముందే గాడ్సే సినిమాకు నాన్ థియేట్రికల్ గా మంచి ప్రాఫిట్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
గాడ్సే యొక్క డిజిటల్ హక్కులు 5 కోట్లకు అమ్ముడయ్యాయి. హిందీ డబ్బింగ్ హక్కులు 2.20 కోట్లకు కొనుగోలు చేయబడ్డాయి. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్‌తో పాటు ప్రీ-బిజినెస్ డీల్ ద్వారా గాడ్సే టీమ్ 7.2 కోట్లను రికవరీ చేసినట్లు తెలుస్తోంది.
విమర్శకుల ప్రశంసలు పొందిన నటి ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, సి.కె స్క్రీన్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ గాడ్సేను నిర్మిస్తున్నారు. ఇక గాడ్సేకు థియేటర్లో పోటీగా విరాట పర్వం సినిమా కూడా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి గాడ్సే సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.