పోల్ పై అందాల మల్లె తీగ

Update: 2018-01-23 15:05 GMT
ఇండియన్ ప్రముఖ ఫొటో గ్రాఫర్ డబ్బూ రత్నాని ఈ సారి 2018 క్యాలెండర్ కోసం ఎంచుకున్న బ్యూటీల ఫొటోలు చాలా పాపులర్ అయ్యేలా ఉన్నాయి. తన కేమెరా యాంగిల్స్ ని అందానికి తగ్గట్టు సెట్ చేస్తూ రత్నాని బాలీవుడ్ బ్యూటీలని చాలా సెక్సీగా చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రియాంకా చోప్రా సన్నీ లియోన్ అలాగే ఇతర హీరోయిన్స్ ఫొటో షూట్ కి సంబంధించిన ఒక్కో స్టిల్ అందరిని ఆకర్షిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరు వారి వారి స్టైల్ లో కనిపిస్తుంటే శ్రీలంకన్ బ్యూటీ మాత్రం డిఫెరెంట్ గా కనిపించింది.

వర్కౌట్ చేసే కాస్ట్యూమ్స్ తో అందాలను చాలా టైట్ దుస్తుల్లో బందించి ఒక పోల్ పై అదిరిపోయే స్టిల్ ఇచ్చింది. ముఖ్యంగా ఆమె నవ్వు చాలా వరకు మైమరిపిస్తోంది. ఆమె ఎవరో కాదు. జక్వాలిన్ ఫెర్నాండెజ్. మొన్నటి వరకు రత్నాని నిర్వహించిన ఫొటో షూట్స్ లలో ప్రతి హీరోయిన్ చాలా ఘాటుగా కనిపించారు. ఆ ఫొటోలు ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్నాయి. అయితే జక్వాలిన్ పోతో షూట్ మాత్రం కొంచెం డిఫెరెంట్ గా సాగినట్లు తెలుస్తోంది. పోల్ పై ఎదో తెల్లని మల్లెతీగ పారిందా అనేలా ఆమెను కళాత్మకంగా తన కెమెరాలో బందించాడు.

మరి జక్వాలిన్ ఫొటో ఏ స్టయిలో హిట్ అవుతుందో చూడాలి. ఇక ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది అనేవిధంగా కామెంట్స్ చేసింది ఫెర్నాండెజ్. ఈ బ్యూటీ ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూలో తో వివిధ దేశాలను చుట్టేస్తోంది. గత ఏడాది జూడ్వా 2 సినిమాతో మంచి హిట్ అందుకొని మరిన్ని అవకాశాలపై కాన్నేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రేస్ 3 సినిమాలో నటిస్తోంది.




Tags:    

Similar News