'బ్యాడ్ గర్ల్' లవ్ టాటూ అదిరిందిగా..!

Update: 2021-04-16 02:30 GMT
ఇండస్ట్రీలో గ్లామర్ ప్రియులకు నచ్చే అందాలన్నీ బాలీవుడ్ లో ఎక్కువగా తారసపడుతుంటాయి. అలాంటి అందాల విందును పంచే హీరోయిన్లలో ఒకటి జాక్వెలిన్ ఫర్నాండేజ్. నిజానికి సౌత్ ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ షో అనేది పుష్కలంగా కనిపిస్తుంది. శ్రీలంక నుండి వచ్చినటువంటి సుందరి జాక్వెలిన్. సాహో మూవీ 'బ్యాడ్ గర్ల్' సాంగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంది జాక్వెలిన్. ఇండియాలో విదేశీ భామగా అడుగుపెట్టిన ఈ భామ.. తనదైన గ్లామరస్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ నుండి గ్లామర్ పరంగా న్యాయం చేసుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసేసింది. కెరీర్ లో ఫస్ట్ సినిమానే ఘాటైన పెదవి ముద్దులతో ప్రారంభించిన ఈ కుర్రది.. జన్నత్-2 సినిమాతో డెబ్యూ చేసింది.

ఫస్ట్ హిట్ రావడంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ స్టార్ అయిపోయింది. జాక్ ఎంత అందంగా ఉంటుందో అదేవిధంగా న్యూ ట్రెండ్ ఫాలో అవుతుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్లలో సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసేది జాక్ మాత్రమే. సోషల్ మీడియాలో జాక్ అందాలకు ఫాలోయింగ్ కోట్లలో ఉంది. ఫ్యాన్స్ కోసం జాక్ ఒక్కో సోయగాన్ని ఫోటో రూపంలో ఇంస్టాగ్రామ్ లో ప్రదర్శిస్తుంది. జాక్ తాజాగా షేర్ చేసిన పిక్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా అమ్మడు భుజం పై లవ్ సింబల్ టాటూ వేయించుకొని సెల్ఫీ పిక్ పోస్ట్ చేసింది. స్లీవ్స్ లో ఉన్న జాక్ ఆపిల్ ఐఫోన్ లో అద్దం వంక చూసుకుంటూ దిగిన ఫోటోలో అమ్మడిని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఫోటో ఏమోగానీ జాక్ మాత్రం లోదుస్తులలో కనిపించడంతో కుర్రాళ్ళు మతులు పారేసుకుంటున్నారు. ప్రస్తుతం జాక్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది.
Tags:    

Similar News