రోమ్ వెళితే రోమన్ లా బతకాలంటారు! వెళ్లే ప్లేసును బట్టి మన బిహేవియర్ ఆటోమెటిగ్గా మారిపోవాలి. లేదంటే ఛీప్ గానో - సిల్లీగానో చూస్తుంది మాయదారి లోకం. ఈ విషయంలో జాకీ అలియాస్ జాక్విలిన్ ఎంతో నేర్పరి. ఇండియాలో ఉంటే పనే దైవం.. ఫ్యామిలీయే లోకం! అన్నట్టు బతికేస్తోంది జాకీ. అదే రోమ్ వెళితే.. అక్కడే ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాల్సి వస్తే.. అందుకు తెలివైన ప్లానింగే చేసింది. ఎక్కడో దేశం కాని దేశం బుడాపెస్ట్ కి వర్క్ కమిట్ మెంట్స్ కోసం బయల్దేరి వెళ్లినా.. అంతకుముందే ఫ్యామిలీతో ఇటలీలో టైమ్ స్పెండ్ చేసింది. అక్కడే తన బర్త్ డే పార్టీని చేసుకుంది. అంతేనా.. ఊరు కాని ఊరు వెళ్లాం కదా అని ఫ్యామిలీని దూరం పెట్టేయలేదు. కుటుంబ సమేతంగా ఇటలీలో ల్యాండ్ అయిపోయింది. అటుపై ఖాళీ సమయం చిక్కింది కదా అని.. పిజ్జా తిని .. ఫ్లూటుగా జూస్ తాగి నిదురోలేదు. పిజ్జా తింటూనే వాకింగ్ లు - జాగింగ్ లు చేసింది. తోడుగా గారాల సిస్ ని కూడా తీసుకెళ్లింది. ఇంత తెలివైన ప్లానింగ్ ఇంకెవరి వల్లనైనా అవుతుందా? అంటే.. ప్ఛ్ కుదరనే కుదరదు సుమీ!
ఇదిగో ఇటలీలో రొమానియన్‌లా కనిపించాలన్న ఫార్ములాని తూ.చ తప్పక ఆచరిస్తూ ఇలా పింక్ లో కనిపించింది. కాలిపై కాలేసుకుని కూచుంటే ఆ పింక్ కటింగ్ ఫ్రాకు సౌకర్యంగా సైడైపోయింది. ఆ కళ్లలోనే బోలెడంత కవ్వింత తుళ్లింత. నెత్తిపై బ్రిటన్ రాణి ఎలిజబెత్‌లా అదిరిపోయే హ్యాట్‌ని ధరించింది. యోగా చేస్తే సూర్య రశ్మి ముఖానికి తగలాలి కానీ, ఎండలో స్వేదం చిందించేంత శ్రమించకూడదన్న సూత్రాన్ని పాటిస్తోంది. ఆ పక్కనే జాకీ సిస్ అంతే అందంగా పొట్టి నిక్కరులో దర్శనమిచ్చింది. ఇదిగో అక్కతో పాటే గారాల చెల్లాయ్ ఎలా నవ్వులు చిందిస్తోందో? ఇన్‌స్టా ఫోటోల్లో జాక్విలిన్ అందచందాలు ఓ రేంజులో అలరిస్తున్నాయి.
అంతేకాదు రోమ్ - ఇటలీ నగరం ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో ఆ ఫోటోల్లో బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తోంది. ఆ దేశానికి జాకీ టూరిజం అంబాసిడర్ కాకపోయినా .. ఎంతో మేలు చేస్తోందిలా. అన్నట్టు ఇలియానా ఫిజీకి బ్రాండింగ్ చేసినట్టు జాకీ కూడా అక్కడ విదేశీ టూరిజం మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంటే పనిలో పనిగా చాలానే కలిసొచ్చేది! ఇప్పటికైతే జాకీ సల్మాన్ భాయ్ సరసన `రేస్ 3` చిత్రంలో నటిస్తోంది. ఇదివరకూ లాంచ్ చేసిన జాక్విలిన్ ఫస్ట్ లుక్ కుర్రకారులో సెగలు పుట్టించింది. ఆ గుబులు నుంచి కోలుకోకముందే - ఇదిగో ఇలా ఇన్ స్టాగ్రమ్ లో మరోసారి వేడెక్కించే ఫోటోలతో విరుచుకుపడింది.