దేశంలో 200 కోట్ల కుంభకోణం కేసు ఎంతటి సంచలనమైందో తెలిసిందే. కాన్ మాన్ ట్రాప్ లో పలువురు బాలీవుడ్ నాయికలు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హాట్ గాళ్ జాక్వెలిన్ పెర్నాండేజ్ ఈడీ విచారణని ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమెను రెండు సార్లు ఈడీ విచారించి కీలక సమాచారం సేకరించారు. సుకేష్ చంద్రన్ తో అత్యంత సన్నిహితంగా మెలగడం జాకీ పీకల మీదకు తెచ్చింది. ఇప్పటికే ఆమె ఇచ్చిన వాగ్ములాన్ని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. తాజాగా దేశం దాటడానికి ప్రయత్నిస్తోన్న జాక్వెలీన్ పోలీసులకు చిక్కి మరింత సంచలనమైంది. ముంబై ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె పాస్ పోర్ట్ పరిశీలించి తాను విదేశాలకు జంప్ అవుతున్నట్టు గ్రహించి వెంటనే పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఓ వైపు కేసు విచారణలో ఉండగా శ్రీలంకన్ బ్యూటీ జాక్విలన్ ఇంతటి సాహసం ఎందకు చేసినట్టు? అంటే రియాద్ లో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తోన్న `దబాంగ్ టూర్` కోసం ఆదివారం దుబాయ్ ప్రయాణమైందట. అయితే పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. దేశం నుంచి స్కిప్ అయ్యే అవకాశం కూడా ఉండటంతో కోర్టు ముందస్తు ఉత్తర్వులతో పోలీసులు జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను అధికారులు అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించినట్లు తెలిసింది. అక్కడ మరోసారి మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారించనున్నారు. అలాగే ఆక్షంలు ఉన్న సమయంలో విదేశాలు వెళ్లడం ఏంటి? అనేది ప్రధానంగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చుట్టూ రోజు రోజుకి ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే 200 కోట్ల కుంభకోణంలో 10 కోట్లు ఆమెఖాతలో బహుమతుల రూపంలో పడ్డట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కుంభకోణంలో భాగస్వామి అయింది. ఆమెతో పాటు నోరా పతేహీ కూడా వివాదాంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కోటి రూపాయల ఖరీదుగల కారు..ఇంకా బహుమతులు నోరా పతేహీ అకౌంట్ జమ అయ్యాయి.