2019 మోస్ట్ అవైటెడ్ బయోపిక్ గా వైయస్సార్ `యాత్ర` పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకుల్లో ఎంతో ఎమోషన్ కు ఆస్కారం ఉన్న వైయస్సార్ జీవితాన్ని వెండితెరపై చూడాలన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు ఉంది. అందుకు తగ్గట్టే ఇటీవల రిలీజైన యాత్ర ట్రైలర్ ఆసక్తి రేకెత్తించింది. వైయస్ యాత్ర ఆద్యంతం రక్తి కట్టించే ఎన్నో విషయాల్ని తెరపైకి తేవడంలో మహి.వి.రాఘవ్ టీమ్ పనితనం ట్రైలర్ లో కనిపించింది. ఒక ముఖ్యమంత్రి విజన్ ని తెరపై చూపించే ప్రయత్నం సాగుతోందని అర్థమవుతోంది.
`యాత్ర` చిత్రాన్ని ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం పరంగానూ యాత్ర ఓ మెట్టు పైనే ఉంది. ఇకమీదట ఇంకా ఉధృతంగా ప్రచారం చేసేందుకు దర్శకనిర్మాతల బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి -1న బీచ్ సొగసుల విశాఖ నగరంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ ఈవెంట్ కి అతిధుల్ని ఇప్పటికే ఫైనల్ చేశారట.
వైయస్ జీవితంపై సినిమా కాబట్టి ఈ ఈవెంట్ లో వైయస్సార్ ఫ్యామిలీ సభ్యులు ఉండాలని దర్శకనిర్మాతలు మహి.వి.రాఘవ్, విజయ్ చిల్లా- శశి దేవిరెడ్డి భావిస్తున్నారట. ఆ మేరకు వైసీపీ అధినాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఆ మేరకు జనవరి 9 (పాదయాత్ర చివరి రోజు)న జగన్ ని దర్శకనిర్మాతలు సంప్రదించనున్నారట. అంటే ఫిబ్రవరి 1వ తేదీ వైజాగ్ జామ్ అయ్యేలా భారీగా జగన్ అభిమానుల మధ్య ఈ ఈవెంట్ జరగనుందని అర్థమవుతోంది. ఆ మేరకు నగరవాసులకు హై ఎలెర్ట్ బెల్ మోగినట్టే. ఓవైపు ఉత్తరాంధ్ర యావత్తూ వైసీపీ ఫీవర్ రాజుకుంటున్న వేళ ఈ ఫిల్మీ ఈవెంట్ పలు సంచలనాలకు తావివ్వబోతోందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆరోజు వైకాపా తరపున ప్రచారానికి వచ్చే సెలబ్రిటీలంతా వేదికపై కనిపించే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.
Full View