స్పీల్ బర్గ్ సినిమాలో జగపతిబాబు

Update: 2016-05-28 10:44 GMT
జగపతిబాబు సౌత్ ఇండియాను ఏలుతున్న మాట వాస్తవమే. మరీ ఆయన ప్రభ హాలీవుడ్ కు పాకేసిందా ఆని ఆశ్చర్యపోతున్నారా..? ఐతే స్పీల్ బర్గ్ సినిమాలో జగపతి బాబుకు చోటు దక్కుతున్న మాట వాస్తవమే కానీ.. అది డైరెక్టుగా కాదు.. ఇన్ డైరెక్టుగా. స్పీల్ బర్గ్ సినిమాలో జగపతిబాబు కనిపించట్లేదు. కేవలం వినిపించబోతున్నాడు. అర్థమైందిగా.. స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నాడన్నమాట మన జగపతి.

ఆ సినిమా పేరు ‘ది బి.ఎఫ్.జి’. డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 24 అడుగుల ఎత్తుండే ఓ విచిత్ర మానవుడు.. పదేళ్ల చిన్నారి చిన్నారి మధ్య సాగే కథతో తెరకెక్కింది. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరొందిన స్పీల్ బర్గ్ చాన్నాళ్ల విరామం తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 1న విడుదల కాబోతోంది.

ఆ 24 అడుగులుండే విచిత్ర మానవుడి పాత్రకు జగపతి బాబు తెలుగుతో పాటు తమిళంలోనూ డబ్బింగ్ చెబుతుండటం విశేషం. చాలా రఫ్ గా ఉండే జగపతి బాబు వాయిస్ ఈ పాత్రకు బాగా సూటవుతుందని ఆయన్ని ఎంపిక చేశారు. చిన్నప్పట్నుంచి చెన్నైలో పెరిగిన జగపతికి తమిళం మీద కూడా బాగానే పట్టుందిలెండి. మరి విలన్ అవతారమెత్తాక కొత్త టర్న్ తీసుకున్న జగపతి బాబు కెరీర్.. డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాక ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News