బడా నిర్మాత కొడుకగా పరిచయమై.. ఆ తర్వాత హీరోగా సక్సెస్ లు సాధించి.. తర్వాతి కాలంలో డబ్బులకు తీవ్ర ఇబ్బందులకు గురైన సినీ ప్రముఖుడిగా జగపతిబాబుగా చెప్పొచ్చు. జీవితంలో ఎగుడు దిగుడులు కామనే అయినా.. జగపతిబాబులో మాత్రం మోతాకు మించి ఉంటాయి. హీరోగా స్టార్ జీవితాన్ని అనుభవించి.. మధ్యలో పాత్రల కోసం విపరీతంగా ఎదురుచూస్తూ.. ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూడటం ఒక ఎత్తు అయితే.. ఆ దయనీయ పరిస్థితిని ఎలాంటి మొహమాటం లేకుండా షేర్ చేసుకునే ధైర్యం జగపతి బాబుకే ఉందని చెప్పాలి.
ఆకలితో ఎందుకు ఉండకూడదన్న ఉద్దేశంతో మూడు రోజులు పస్తులుఉండటం ఒక ఎత్తు అయితే.. హీరోగా రాజభోగాలు అనుభవించిన వ్యక్తి.. తర్వాతి కాలంలో షూటింగ్ సమయంలో కూర్చునేందుకు కుర్చీ కూడా వేయించుకోలేని పరిస్థితికి దిగజారటానికి మించిన ఇబ్బంది మరేం ఉంటుంది. ఆ విషయాల్ని తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో జగపతి బాబు షేర్ చేశారు.
కొందరిని నమ్మటం కారణంగా అప్పులపాలైన ఆయనకు సాయం చేసిన ఒకే ఒక్కరు నిమ్మగడ్డ ప్రసాద్ గా జగపతి బాబు చెప్పారు. తనకు రూ.50 లక్షలు ఇచ్చారని.. వడ్డీ కూడా వద్దని చెప్పారని.. ఆ తర్వాత అవసరం ఉందంటే అప్పు చేసి మరీ తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు.
పెద్ద నిర్మాత కొడుకన్న ఫీలింగ్ తనకేమీ లేదన్నారు. తాను వస్తుంటే ఎవాయిడ్ చేసిన నిర్మాతలు ఉన్నారని.. పలుకరిస్తే వేషం ఇవ్వాల్సి వస్తుందని తప్పించుకున్నోళ్లు కూడా ఉన్నారన్నారు. తనకు భోజనం పెట్టని నిర్మాతలు కూడా ఉన్నారని గతాన్ని చెప్పుకొచ్చారు.
తన కుమార్తె ఒక విదేశీయుడ్ని పెళ్లాడారని.. అప్పట్లో తన దగ్గర ఏమీ లేదని.. ఫారినర్ కావటంతో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా రాలేదన్నారు. ఇంట్లో సింఫుల్ గా కార్యక్రమాన్ని చేశామని.. తాను వెళ్లిపోయినట్లుచెప్పారు. తనకు లోధా లో ప్లాట్ ఉందన్నారు. సినిమా ఇండస్ట్రీ బేసిగ్గా పెద్ద బిజినెస్ అని..ఇక్కడ గుడ్ ఫ్రెండ్స్ అంటే.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే తప్ప మరే విధంగానూ కనెక్షన్ ఉండదన్నారు. కోట్లల్లో బిజినెస్ జరిగేటప్పుడు అలానే ఉంటుందని.. ఉపయోగం ఉంటే ఓకే.. లేదంటే.. ఏమీ ఉండదంతేనని తేల్చేశారు.