తెలుగులో ఉన్న హ్యాండ్ సమ్ హీరోల్లో జగపతి బాబు ఒకరు. కొన్నేళ్ళ క్రితం అయన హీరోగా నటించిన సినిమాలకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో విలన్ గా - క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఒక్క తెలుగే కాకుండా సౌత్ లోని అన్ని భాషల్లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. అయన ఇప్పుడు బాలీవుడ్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.
అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ చిత్రం 'తానాజీ' లో జగపతి బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. జగపతి బాబు పాత్ర డీటెయిల్స్ బయటకు రాలేదు కానీ తన పాత్ర కోసం లుక్ టెస్ట్ చేసిన ఫొటో బయటకు వచ్చింది. మెలితిప్పిన మీసాలు - నెరిసిన గుబురు గడ్డంతో- నారింజ రంగు తలపాగా ధరించి మరాఠా యోధుడిగా మరిపోయాడు. డీజే లా జేబీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేకః కేకస్య కేకోభ్యః.
వయకామ్ 18 మోషన్ పిక్చర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్ డైరెక్టర్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లోనే ప్రారంభిస్తారట. ఇక ఈ సినిమాలోని మరో హైలైట్ ఏంటంటే అజయ్ దేవగణ్ - కాజోల్ జంట 9 ఏళ్ళ తర్వాత కలిసి నటిస్తుండడం. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఛత్రపతి శివాజీ తో కలిసి పోరాడిన వీరుడు సుబేదార్ తానాజి మలుసారే పాత్రలో కనిపిస్తాడు.