జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్ర ప్రసాద్ పెద్ద నిర్మాత. ఆయన వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన జగపతి కూడా హీరోగా బాగానే నిలదొక్కుకున్నాడు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకుని బాగానే సంపాదించాడు. ఐతే ఓ దశలో జగపతి బాబు కెరీర్ దెబ్బ తిని.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లుగా వార్తలొచ్చాయి. డబ్బుల కోసమే చిన్నా చితకా సినిమాలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందన్నారు. ఐతే ‘లెజెండ్’ సినిమాతో ఆయన కెరీర్ మలుపు తిరిగి.. ఆయనకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు కోట్లల్లో పారితోషకం తీసుకుంటూ బాగానే సంపాదిస్తూ ఆర్థికంగా మళ్లీ నిలదొక్కుకున్నారు. ఐతే డబ్బు అవసరమైన మేరకే సంపాదిస్తా తప్ప.. తనకు దాని మీద పెద్దగా ఆశ లేదంటున్నాడు జగపతి. తన కుటుంబానికి రూ.40 కోట్లు ఉంటే చాలని.. అంతకంటే అవసరం లేదని జగపతిబాబు అభిప్రాయపడ్డాడు.
‘‘డబ్బుల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. డబ్బులు అవసరమే... కానీ కోట్లకు కోట్లు ఏం చేసుకుంటాం. నాకైతే మా కుటుంబం కోసం రూ.40 కోట్లుంటే చాలనిపిస్తుంది. ఎందుకంటే మేం ఇంట్లో నలుగురం ఉన్నాం. ఆ నలుగురికి తలో పది కోట్ల చొప్పున రూ.40 కోట్లన్నమాట. అంతకంటే సంపాదించడంలో అర్థం లేదనిపిస్తుంది’’ అని జగపతిబాబు చెప్పాడు. విలన్.. క్యారెక్టర్ రోల్స్ తో బండి సాఫీగా సాగిపోతున్న సమయంలో మళ్లీ హీరోగా ‘పటేల్ సార్’ చేయడం గురించి స్పందిస్తూ.. ‘‘హీరో అనిపించుకోవాలని ఈ సినిమా చేయలేదు. నిజానికి ఈ సినిమాలో అందరూ హీరోలే. కథ అంత బలంగా ఉంటుంది. నిజానికి ఈ వయసులో నాకు హీరోగా చేయాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తా’’ అని జగపతిబాబు అన్నాడు.