పాత్ర నచ్చితే ఏదైనా చేస్తా!!

Update: 2017-07-14 09:37 GMT
తెలుగు సినిమాలో కొంతమంది హీరోలు లిస్ట్ లోకి వస్తారు మరికొంతమంది విలన్లు లిస్ట్ లోకి వస్తారు. ఇంకా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిస్ట్ లోకి వస్తారు కానీ  జగపతి బాబు మాత్రం అన్నింటిలోనూ ఉంటాడు. కెరియర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోతున్న టైమ్ లో విలన్ గా చేసి మళ్ళీ తన స్టార్ స్టేటస్ ను వెనకకు తెచ్చుకున్నాడు. జగపతిబాబు ఇప్పుడు తెలుగులోనే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రి లో చాలా  హీరోలకు ప్రతి నాయకుడులా నటిస్తున్నాడు. అలా చేస్తున్న చాలా  కాలంకు మళ్ళీ  హీరోగా నటించే అవకాశం వచ్చింది ‘పటేల్ SIR’  సినిమా ద్వారా.

ఈరోజు విడుదల అయిన ఈ సినిమా గురించి జగపతి భలే ఇంట్రెస్టింగ్ సంగతులు చెప్పాడు. “అసలు మళ్ళీ నా సినిమా విడుదలకాబోతుంది అనే ఆలోచనే కొంచం భయపెడుతోంది. జనాలు మళ్ళీ నన్ను ఎలా తీసుకోబోతున్నారో అనే ఆలోచన చిన్న కలవరపెడుతుంది. నిర్మాత సాయి కొర్రపాటి డైరెక్టర్ వాసు నా పై పూర్తి నమ్మకం ఉంచారు. వాళ్ళు నా పై ఉంచిన నమ్మకం వలనే నేను ఇలాంటి పాత్ర ఇప్పుడు చేయగలిగాను. కథ మొత్తం ఒక చిన్న పిల్ల చుట్టూ తిరుగుతుంది. ఆ పాపే కథకు ఆధారం'' అని చెప్పాడు. ఇప్పుడు ఉన్న పోటీలలో మీ సినిమా ఎంతవరుకు విజయం అందుకోగలదు అని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు “ పోటీ ఎప్పుడూ ఉంటుంది అందరికీ ఉంటుంది. ప్రేక్షకులు నచ్చితే ఎప్పుడైనా సినిమాలు చూస్తారు అన్నాడు. అయినా పోటీ అనే పదం నాకు ఇప్పుడు సరికాదు. నేను పోటీలో ఉండే కాలం అయిపోయింది'' అంటున్నాడు జగపతి.

పాత్రలు ఎంపిక ఎలా చేస్తారు, మీ తదుపరి సినిమాలు ఎలాంటివి చేయాలి అని అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు నిక్కచ్చిగా చెప్పిన సమాధానం ఏంటంటే  ”నాకు హీరోగా చేయాలి అనేమీ లేదు ఒక ముఖ్యమైన పాత్ర ఉండి కథలో నాకు ఒక ప్రాధాన్యం ఉంటే అది ఎలాంటి పాత్ర అయినా చేస్తాను. హింది లో అమితాబ్ బచ్చన్ నాకు ఆదర్శం, ఆయన లాగా అన్నీ రకాల పాత్రలు చేయాలి అని అనుకుంటున్నాను'' అన్నాడు. మొత్తానికి ఈయనకు పాత్రలు.. ఫ్యూచర్.. అన్నింటిమీదనా ఫుల్ క్లారిటీ బాగా ఉన్నట్లుందే.


Tags:    

Similar News