రామ్ చరణ్ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. యాక్షన్ కంటెంట్ అదిరిపోయే స్థాయిలో ఉంటుందట. అందుకోసమే బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ను విలన్ గా తీసుకున్న సంగతి కూడా తెలిసిందే.
అయితే.. చెర్రీ సినిమాలో ఓ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందట. అటు నెగిటివ్ ఛాయలతో పాటు.. ఇటు పాజిటివ్ గాను ఉండే ఈ రోల్ సూపర్బ్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ పాత్రకు జగపతి బాబును తీసుకున్నారట. ఈ పాత్రను ఇప్పటికే జగపతి అదరగొట్టేస్తున్నాడని తెలుస్తోంది. అయితే.. ఈ ఒక్క సినిమా కోసం జగ్గూ భాయ్ పలు సినిమాలను వదులుకుని మరీ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు ఇద్దరు వ్యక్తులు కారణం అంటున్నారు. ఒకరు బోయపాటి అయితే.. రెండో వ్యక్తి రామ్ చరణ్.
జగపతిని లెజెండ్ మూవీతో విలన్ గా మార్చి.. కొత్త రూపం ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను. మరోవైపు రామ్ చరణ్ తన రంగస్థలం మూవీలో ప్రెసిడెంట్ గారి పాత్రకు జగపతి బాబునే ఏరికోరి ఎంచుకున్నాడు. ఈ పాత్ర ద్వారా జగపతి నట విశ్వరూపం అందరికీ తెలిసొచ్చింది. ఈ ఇద్దరి కోసమే పలు చిత్రాలను వదులుకుని మరీ చేస్తున్నాడట జేబీ.