ఇంత‌కంటే క్రూరంగా చూపించ‌లేరు!

Update: 2018-10-21 16:30 GMT
అర‌వింద స‌మేత చిత్రంలో వీర‌రాఘ‌వుని పాత్ర‌ను డామినేట్ చేస్తూ జ‌గ‌ప‌తిబాబు . .. బ‌సిరెడ్డి పాత్ర పండింది. అయితే ఆ పాత్ర అంత‌గా పండ‌డం వ‌ల్ల‌నే సినిమా హిట్టెక్కింది అన్న‌ది నిపుణుల విశ్లేష‌ణ‌. ఇదే విష‌యాన్ని నేటి స‌క్సెస్ వేదిక‌పై చెబుతూ త్రివిక్ర‌మ్‌ కి థాంక్స్ చెప్పాడు జ‌గ‌ప‌తిబాబు. న‌న్ను ఇంత‌కంటే క్రూరంగా ఎవ‌రూ చూపించ‌లేద‌ని కితాబిచ్చేశాడు జ‌గ్గూభాయ్. ఈ వేదిక‌పై జ‌గ‌ప‌తి మాట్లాడుతూ చాలా పెద్ద స‌ర్‌ ప్రైజ్‌ లే ఇచ్చారు.

త‌ప్పులుంటే క్ష‌మించాలి అంటూనే.. హీరోగా నా కెరియ‌ర్ 2010లోనే ముగిసింది. 2012లో మా బాల‌య్య బాబు లెజెండ్ చిత్రంలో జితేంద్ర పాత్ర‌లో న‌టించాను... అని గుర్తు చేశారు. బాల‌య్య‌ - ఎన్టీఆర్‌ ల‌ను చూస్తే, ఆ ఇద్ద‌రిలోనూ ఒకే ల‌క్ష‌ణం క‌నిపించింది. బాల‌య్య‌బాబు ప్ర‌తినాయ‌కుడు- నాయ‌కుడు అనే టాపిక్ ని ఎత్తారు ఇదివ‌ర‌కూ. చేసే క్యారెక్ట‌ర్ ఏద‌యినా చివ‌రికి సినిమాకి క‌లిసి రావాలి అని బాల‌య్య‌ బాబు స్ట్రెస్ చేశారు. అలాగే తార‌క్ కూడా అర‌వింద స‌మేత కోసం అదే చేశాడు అని అన్నారు. అదే కాదు.. `నాన్న‌కు ప్రేమ‌తో` సినిమా చేసేప్పుడు తార‌క్ కు నాకు ఒక డిస్క‌ష‌న్ వ‌చ్చింది. తార‌క్ నాకు నిన్ను - బాల‌య్య‌బాబును ఒక స్టేజ్‌ పై చూడాల‌నుంది అన్నాను. ``బాబూ ఆయ‌న నా బాబాయ్ బాబూ .. ఆయ‌నంటే ప్రేమ‌.. నాకు ఇష్టం..`` అనీ అన్నాడు. అది నేటికి సాధ్య‌మైంది.. అని జ‌గ‌ప‌తి అన్నారు. నేనెప్పుడూ ఫోటో దిగ‌లేదు.. వీళ్ల‌తో దిగాను అందుకే అనీ తెలిపాడు.

నంద‌మూరి ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ... అభిమానులు గొప్ప‌వాళ్లు. .వాళ్లంతా క‌లిసి ఉండాలి.. చ‌క్క‌గా ఉండాలి... అనీ వేదిక‌పై ఉన్న నంద‌మూరి హీరోల్ని చూపించారు జ‌గ‌ప‌తి. సినిమా సెల‌బ్రేష‌న్ ఉంటే.. అస‌లైన దీపావ‌ళి - ద‌స‌రా ఇక్క‌డ చూస్తున్నాం.. అని నంద‌మూరి ఫ్యాన్స్ వైపు చూపించారు. మొత్తానికి వేదిక‌పై జ‌గ‌ప‌తి నంద‌మూరి హీరోల‌కు త‌న‌దైన శైలిలో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Tags:    

Similar News