ఫోటో స్టోరీ: స్పామ్ కాదు.. సో సెక్సీ

Update: 2019-10-06 07:51 GMT
స్టార్ కిడ్స్ అయితే ఆటోమేటిక్ గా కెరీర్ సెట్ అయిపోతుందని అనుకునేవారు చాలామందే ఉంటారు కానీ అందరూ స్టార్ కిడ్స్ కు సక్సెస్ రాదు.  అందరూ స్టార్ ఇమేజ్ సాధించలేరు.  అయితే కొందరు మాతం తమ తల్లిదండ్రుల బాటలో నడిచి వారి లెగసీని కొనసాగించే ప్రయత్నం చేస్తారు.  అతిలోకసుందరి శ్రీదేవికి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్ ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలే చేస్తోంది.  

మొదటి సినిమా 'ధడక్' తో హిట్ సాధించిన జాన్వి నటనకు.. లుక్స్ కు పాస్ మార్కులే వచ్చాయి.  ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫోటోషూట్లను మరిచిపోదు.  రీసెంట్ గా జాన్వి ఎల్లి అవార్డ్స్ ఈవెంట్ కు హాజరైంది.  మామూలుగానే జాన్వి న్యూ జెనరేషన్ స్టైల్ ఐకాన్. ఇక ఇలాంటి కార్యక్రమాలకు ఇన్విటేషన్ వస్తే ఊరుకుంటుందా? కత్తిలా రెడీ అయింది.. ఆ డ్రెస్ తోనే ఫోటో షూట్ లో పాల్గొని వాటిని తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  

ఈ ఫోటోలకు "సారీ ఫర్ స్పామ్ గైస్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అయినా మన సోషల్ మీడియాలో చెత్త గుడ్ మార్నింగులు.. గుడ్ నైట్లు.. పనిలేని వారి టిక్ టాక్ వీడియోలు అయితే 'స్పామ్' అనుకోవచ్చు కానీ జాన్వి ఫోటోలను స్పామ్ అని ఎవరు అనుకుంటారు. బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ గౌన్.. థై స్లిట్.. ఉండడంతో ఎంత హాటుగా ఉండాలో అంత హాట్ గా ఉంది.  ఇక ఈ డ్రెస్ లో అంతకంటే హాటుగా పోజులిచ్చింది. ఒక్కో యాంగిల్ లో శ్రీదేవి పోలికలు కూడా కనిపిస్తున్నాయి.

అందుకే  ఈ ఫోటోలకు  నెటిజన్ల కామెంట్లు అదిరిపోయాయి. "స్పామ్ కాదు.. సో సెక్సీ".. "శ్రీదేవి 2019".. "ఎల్లి కా ఖేల్ ఖతం".. "సూపర్ డూపర్ హాట్" అంటూ పొగిడారు.  ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News