ఈ ఏడాది అత్యంత పాపులర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన మూవీ `జై భీమ్`. ఓ యదార్ధ గాధ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో సూర్య నటించిన విషయం తెలిసిందే. ఓ గిరిజనుడి లాకప్ డెత్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. టీ.జె. జ్ఞానవేళ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై హీరో సూర్య నటించి నిర్మించారు. లాయర్ చంద్రు నిజజీవిత పాత్రలో సూర్య పలికించిన అభినయం విమర్శకుల ప్రశంసలు కురిపించింది. సినతల్లి పాత్రలో కనిపించి తనదైన నటనని ప్రదర్శించిన లిజో మోల్ జోస్ ఈ సినిమాతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.
ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకోవడమే కాకుండా అత్యుత్తమ చిత్రంగా నిలిచి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపిన ఈ చిత్రం అదే స్థాయిలో వివాదాల్ని కూడా ఎదుర్కొంది. సూర్య ని కూడా ఓ దశలో వివాదంలో ఇరుక్కునేలా చేసింది. అంతే కాకుండా ఆస్కార్ తరువాత ఆ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన `గోల్డెన్ గ్లోబ్` అవార్డుల జాబితాలో మన దేశం నుంచి స్థానన్ని సొంతం చేసుకుందనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా తాజాగా మరో ఘనతని సాధించింది. మరి కొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ నిర్వహించిన 2021 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాలో ప్రముఖంగా `జై భీమ్` నిలిచింది. ఐఎండీబీ తమ యూజర్స్‌ని ఆధారంగా చేసుకుని రూపొందించిన 2021 మోస్ట్ పాపులర్ ఇండియాన్ సినిమాల జాబితాలో `జై భీమ్` మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ జాబితాలో నిలిచిన టాప్ 10 చిత్రాల లిస్ట్ ఇలా వుంది.
1. జై భీమ్ ( కోలీవుడ్ )
2. షేర్ షా ( బాలీవుడ్ )
3. సూర్య వన్షీ ( బాలీవుడ్ )
4. మాస్టర్ ( కోలీవుడ్ )
5. సర్దార్ ఉద్ధమ్ ( బాలీవుడ్ )
6. మీమీ (బాలీవుడ్ )
7 . కర్ణన్ (కోలీవుడ్ )
8. షద్ధత్ (సన్నీ కౌషల్ )
9. దృశ్యం - 2 ( మలయాళం)
10. హసీనా దిల్‌రుబా ( బాలీవుడ్ )