జై సింహ 3 రోజుల కలెక్షన్ రిపోర్ట్

Update: 2018-01-15 11:12 GMT
సంక్రాంతి సెంటిమెంట్ ఈ సారి ఎవరికి పూర్తి ఫేవర్ చేయలేకపోయింది. వచ్చిన నాలుగు సినిమాల్లో అజ్ఞాతవాసి అవుట్ రైట్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, సూర్య గ్యాంగ్ అందరిని మెప్పించలేక ఇబ్బంది పడుతోంది. ఇక రాజ్ తరుణ్ రంగుల రాట్నం స్లో నెరేషన్ వల్ల టాక్ పాజిటివ్ గా తెచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. ఇక నందమూరి బాలకృష్ణ జైసింహ కూడా ఏమంత గొప్పగా లేనప్పటికీ మాస్ ప్రేక్షకులకు దీన్ని మించిన బెటర్ ఆప్షన్ లేదు కాబట్టి తమ ఓటు దీనికే వేస్తున్నారు. రొటీన్ స్టొరీని పాత కాలం నాటి ఫార్ములాలో తీసారు అనే కామెంట్స్ వినిపిస్తున్నా జైసింహ పరిస్థితి మరీ తీసికట్టుగా లేదు. ట్రేడ్ వర్గాల నుంచి వర్గాల కలెక్షన్స్ ఈ విధంగా వచ్చాయని అంటున్నారు.

                   షేర్               గ్రాస్

                   (కోట్లలో)          (కోట్లలో)

వైజాగ్             1.31

ఈస్ట్               1.18

వెస్ట్               1.05

కృష్ణా              0.80

గుంటూర్         1.57

నెల్లూర్            0.64

ఆంధ్ర              6.55             9.6

సీడెడ్              2.90             3.8

నైజాం             2.30             4.1

మొత్తం            11.75            17.5

(తెలుగు రాష్ట్రాలు)

యుఎస్          0.35             1.2

కర్ణాటక           1.10              2.2

మిగిలిన చోట     0.70             2.0

టోటల్            13.9              22.9

(వరల్డ్ వైడ్)

ఎలా చూసుకున్నా ఇవి మంచి ఫిగర్స్ అని చెప్పొచ్చు. గత సంవత్సరం వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి స్థాయిలో లేకున్నా వచ్చిన డివైడ్ టాక్ ప్రకారం చూసుకుంటే జైసింహ బాగానే చేసినట్టు అనిపిస్తుంది. ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది కాబట్టి మరో రెండు మూడు రోజులు అదనపు సెలవులు ఉన్న నేపధ్యంలో జైసింహ ఎంతవరకు తన స్టామినా ప్రూవ్ చేసుకుంటాడు అనేది వెయిట్ చేసి చూడాలి. పైసా వసూల్ కంటే మెరుగైన వసూళ్లు రాబడుతుంది అనే అంచనాలో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. ఇవి నిర్మాత ప్రకటించిన అధికారిక లెక్కలు కానప్పటికీ ట్రేడ్ నుంచి విశ్వసనీయ సమాచారం మేరకు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!
Tags:    

Similar News