73 ఏళ్ల వయస్సులోనూ రజినీ కాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను, తన ఫ్యాన్స్ ఆకట్టుకుంటున్నారు. ఈ సారి జైలర్ సినిమాలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో నటిస్తున్న రజినీ.. అదిరిపోయే లుక్ లో కనిపించబోతున్నారు. జైలర్ సినిమాలో రజినీ కాంత్ సరసన నీలాంబరి రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే.
గతంలో వీరిద్దరి కలయికలో చాలానే సినిమాలు వచ్చాయి. కానీ నరసింహ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన పాత్రను మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అంత మంచి పాత్రలో రజినీ పక్కన హీరోయిన్ గా చేసిన ఆమె.. మరోసారి సూపర్ స్టార్ తో జత కట్టబోతుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో సాగే ఈ కథకు రజినీ అదిరిపోయే లుక్ తో పాటు అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉండడంతో... సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.
జైలర్ సినిమాను ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా ఆగస్టు 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. గ్లింప్స్ ద్వారా రిలీజ్ డేట్ ను తెలిపారు. ఈ గ్లింప్స్ లో స్టార్ కాస్ట్ మొత్తాన్ని చూపించారు. చాలా భారీ స్టార్ కాస్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సౌత్ ఇండియాలోని అన్ని పరిశ్రమల నుంచి స్టార్ నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కన్నడ హీరో శివారాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
అంతేకాదండోయ్ వసంత్ రవి, వినాయకన్, యోగి బాబు, మెగా బ్రదర్ నాగబాబు సునీల్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. సునీల్ ఇందులో నెగిటివ్ షేడ్ ఉన్న సీరియస్ పాత్రలో కనిపించనున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
Full View