చరణ్ ముంబై పర్యటన వెనుక కారణమిదే!
ప్రస్తుతం ఆర్సీ16 నెక్ట్స్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ సడెన్ గా ముంబైలో దర్శనమిచ్చాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఎవరూ ఊహించని రీతిలో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దిల్ రాజు గేమ్ ఛేంజర్ మూలాన భారీ నష్టాలను చవిచూశాడు. ఇక మెగా ఫ్యాన్స్ గురించైతే చెప్పనక్కర్లేదు. గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం చూశాక చేసేదేమీ లేక సైలైంట్ అయిపోయారు.
గేమ్ ఛేంజర్ గాయం నుంచి బయటికొచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం తన తర్వాతి సినిమాపై ఫోకస్ పెట్టాడు. చరణ్ తన తర్వాతి సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఎంతో కష్టపడినట్టు ప్రతీ ఒక్కరూ చెప్తున్నారు.
ఉప్పెన సినిమా తర్వాత నుంచి బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ పైనే వర్క్ చేసి దాన్ని శిల్పంలా చెక్కాడని ఆయన సన్నిహితులంతా అంటున్నారు. చరణ్ కెరీర్ లో ఈ సినిమా 16వ మూవీగా తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రీసెంట్ గా హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆర్సీ16 నెక్ట్స్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ సడెన్ గా ముంబైలో దర్శనమిచ్చాడు. దీంతో చరణ్ ముంబై ఎందుకెళ్లాడు? ఏదైనా బాలీవుడ్ సినిమాను లైన్ లో పెడుతున్నాడా అని అంతా భావించారు. అయితే చరణ్ ముంబై వెళ్లింది ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ కోసమట. భీమా జ్యువెలర్ వారి యాడ్ షూట్ కోసం చరణ్ ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది.
యాడ్ షూట్ అవగానే చరణ్ తిరిగి హైదరాబాద్ వచ్చి ఆర్సీ16 నెక్ట్స్ షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చరణ్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రెహమాన్ ఆర్సీ16 కోసం మూడు ట్యూన్స్ ను కూడా రెడీ చేసినట్టు చెప్తున్నారు.