సర్జరీకి ముందు రష్మి పోస్ట్... ఫ్యాన్స్‌లో టెన్షన్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, వెండి తెర ప్రేక్షకులకు రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలోనే బుల్లి తెర ద్వారా స్టార్ డం దక్కించుకుని హీరోయిన్స్ రేంజ్‌లో స్టార్‌డం దక్కించుకుంది.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, వెండి తెర ప్రేక్షకులకు రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలోనే బుల్లి తెర ద్వారా స్టార్ డం దక్కించుకుని హీరోయిన్స్ రేంజ్‌లో స్టార్‌డం దక్కించుకుంది. పలు సినిమాల్లో హీరోయిన్‌గానూ రష్మి గౌతమ్ నటించి మెప్పించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా రష్మి చేస్తున్న సినిమాలు తక్కువే అయినా ఆమె చేసిన ప్రతి సారి అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. కేవలం స్కిన్ షో కి పరిమితం కాకుండా నటన ప్రతిభతో, డాన్స్‌తో అలరించడం ఈమెకే చెల్లింది. అందుకే ఈమె హీరోయిన్‌గా మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు.
సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసే అవకాశం దక్కింది. సుడిగాలి సుధీర్ కాంబోలో చేసిన కొన్ని స్కిట్‌లు, అతడితో లవ్ ట్రాక్ కారణంగా పాపులారిటీ దక్కింది. ఆ పాపులారిటీని కాపాడుకుంటే, మరింతగా స్టార్‌డం పెంచుకుంటూ రష్మి గౌతమ్ యాంకర్‌గా సూపర్ హిట్స్‌తో దూసుకు పోతుంది. బుల్లి తెరపై రష్మి గౌతమ్ కనిపిస్తే హీరోయిన్స్ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కుతూ ఉంటుంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉండే రష్మి గౌతమ్ సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడంతో పాటు, జంతువులపై తనకు ఉన్న ప్రేమను చూపిస్తూ ఉంటుంది.
రష్మి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్‌కి ఆందోళన కలిగించింది. చాలా కాలంగా రష్మి గౌతమ్ బుజం నొప్పితో బాధ పడుతుంది. ఆ బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఎట్టకేలకు సర్జరీకి సిద్ధం అయింది. ఈ సర్జరీతో తాను అనుభవిస్తున్న భుజం గాయం, నొప్పి నుంచి విముక్తి పొందుతాను అనే నమ్మకం వ్యక్తం చేసింది. చాలా రోజులుగా డాన్స్ మిస్ అవుతున్నాను. మళ్లీ డాన్స్ చేస్తూ మీ ముందుకు రావడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మునుపటి ఉత్సాహంతో, పూర్తి ఫిట్ నెస్‌లో రష్మి గౌతమ్ బుల్లి తెరపై సందడి చేయాలని, అదే సమయంలో వెండితెరపైనా హీరోయిన్‌గా వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
హీరోయిన్‌గా తెలుగులో మాత్రమే కాకుండా రష్మి గౌతమ్ ఇతర భాషల్లోనూ నటించింది. తెలుగులో ఈమె ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో శృంగార సన్నివేశాల్లోనూ చాలా అందంగా కనిపించడం రష్మి గౌతమ్‌కి చెల్లింది. ఆ సినిమాలో రష్మి కాకుండా మరో హీరోయిన్ ఎవరు ఉన్నా విమర్శలు వచ్చేవి అని, చాలా అందంగా ఎంత వరకు చేయాలో అంత వరకు రష్మి గౌతమ్ చేయడం వల్లే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని అంటారు. సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ షేర్ చేసే ఫోటోలకు లక్షల్లో ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉంటారు. అందుకే ఆమె సర్జరీ అంటూ పోస్ట్ పెట్టిన వెంటనే అభిమానులు టెన్షన్ పడుతూ గెట్ వెల్ సూన్ అని కామెంట్ పెట్టారు.