సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ ఎలివేషన్ ని దర్శకులు ఎంతో సవాల్ గా తీసుకుంటారు. `దళపతి` రోజుల నుంచి పాపులర్ దర్శకులంతా చేసింది ఇదే. భాషా- ముత్తు- అరుణాచలం- నరసింహా- బాబా - రోబో ఇవన్నీ స్టైల్ కంటెంట్ పరంగా వేటికవే ప్రత్యేకం. ఈ సినిమాల్లో రజనీ ఇస్టయిల్ ని దర్శకులు ఎంతో గొప్పగా ఆవిష్కరించారు. ఇప్పుడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఈ బాటను విడిచిపెట్టలేదు.
తాజాగా రజనీ `జైలర్` టీజర్ విడుదలైంది. నేడు(12-12-2022) రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా జైలర్ చిత్రం నుండి రజనీ లుక్ ను ఆవిష్కరించారు. ఇందులో రజనీ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఖాకీ ఫ్యాంట్ ధరించిన జైలర్ గారు జైల్లో ఎంతో స్టైల్ గా పెర్ఫ్యూమ్ కొట్టుకుని ఏదో ఘనకార్యానికి ప్రిపేరవుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం.. చివరిలో డ్రాయర్ నుండి పొడవాటి కత్తిని తీయడం.. ఈ స్టంట్ అంతా రజనీకాంత్ స్టైల్ ఎలివేషన్ కోసం డిజైన్ చేసినదేననడంలో సందేహం లేదు.
ఈ వీడియో చివరిలో రజనీ ముఖాన్ని దర్శకుడు రివీల్ చేస్తాడు. దీంతో ముందుంది ముసళ్ల పండగ! అన్న మెసేజ్ అభిమానుల్లోకి పంపగలిగాడు దర్శకుడు. ఇక టీజర్ కి అనిరుధ్ మార్క్ రీరికార్డింగ్ ప్రధాన ఆయుధం అని చెప్పాలి. టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గొప్ప ఎలివేషన్ ని తెచ్చింది.
జైలర్ టైటిల్ కి తగ్గట్టే రజనీ యాప్ట్ గా కనిపిస్తున్నారు. తన వయసుకు తగ్గ పాత్రను ఈ చిత్రంలో పోషించారు. సింపుల్ హెయిర్ స్టైల్ ..లైటర్ గడ్డంతో రజనీకాంత్.. అభిమానులు ప్రేక్షకులకు తనను తాను పరిచయం చేసుకున్న తీరు ఆకట్టుకుంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. 14 ఏప్రిల్ 2023న సినిమా విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View