ఎన్టీఆర్ - రామ్ చరణ్ కథానాయికులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న ఈ మల్టీస్టారర్ సీక్వెల్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
'బాహుబలి' సినిమాని రెండు భాగాలుగా తీసి సక్సెస్ అయిన జక్కన్న.. ఇప్పుడు RRR సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. రెండో భాగం ఉంటుందని ముందుగా ప్రకటించకపోయినా.. రాజమౌళి తండ్రి రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సీక్వెల్ పై సిగ్నల్స్ ఇస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ 'ఆర్.ఆర్.ఆర్' సీక్వెల్ గురుంచి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక రోజు ఎన్టీఆర్ తమ ఇంటికి వచ్చి ట్రిపుల్ ఆర్ సీక్వెల్ గురించి అడిగాడని తెలిపారు. తను కొన్ని ఐడియాలను చెప్పానని.. అవి తారక్ - రాజమౌళికి బాగా నచ్చాయని.. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్ రావొచ్చని బాహుబలి రైటర్ చెప్పారు.
ఆయితే ఇప్పుడు మరోసారి RRR సీక్వెల్ పై నోరు విప్పారు జక్కన్న తండ్రి. దీనికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇచ్చిన స్పెషల్ పార్టీ వేదికైంది. ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద నైజాం ఏరియాలో రిలీజ్ చేసిన దిల్ రాజు.. రికార్డ్ స్థాయి డిస్ట్రిబ్యూషన్ షేర్ తో లాభాలు గడించాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.
ఎస్వీసీ హోస్ట్ చేసిన ఈ పార్టీకి మొత్తం 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ తో పాటుగా ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మరోసారి ట్రిపుల్ ఆర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. RRR అనేది ఒక ఫ్రాంచైజీగా ఉంటుందని.. ఈ సినిమాకి సీక్వెల్ సాధ్యమవుతుందని రచయిత చెప్పాడట.
RRR సినిమాకి సీక్వెల్ సాధ్యం కాదని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి అన్నారు. అప్పటి నుంచి తనయుడు సైలెంట్ గా ఉంటున్నా విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈ సినిమా సీక్వెల్ పై హింట్ ఇస్తూ వస్తున్నారు. మరి త్వరలోనే సీక్వెల్ ఐడియా పై వర్క్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి.
1920స్ బ్యాక్ డ్రాప్ లో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల స్పూర్తితో కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ చరణ్-ఎన్టీఆర్ లను బ్యాలన్స్ చేస్తూ సినిమా చేసినప్పటికీ.. ఇద్దరి పాత్రల ప్రాధాన్యతపై చర్చ జరుగుతూనే ఉంది. ఒకవేళ సీక్వెల్ స్క్రిప్టు రాస్తే ఈసారైనా ఇలాంటివి రాకుండా చూసుకుంటారేమో.
RRR సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాక్సాఫీస్ రికార్డులు ఖాయమని అంటున్నారు. కాకపోతే రాజమౌళి అనుకున్నా ఈ సినిమా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. ట్రిపుల్ ఆర్ హీరోలిద్దరూ ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు.
మరోవైపు జక్కన్న సైతం మహేష్ బాబుతో సినిమా పూర్తి చేయాలి.. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేసే ప్లాన్ ఉంది. సో 'ఆర్.ఆర్.ఆర్' సీక్వెల్ ఇప్పట్లో సాధ్యం కాదని అర్థం అవుతుంది.