దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే హీరోల ఇంట్రో వీడియోలు - హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్య చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఆయన్ని చూపించి అంచనాలు రెట్టింపు చేశారు.
ఇదే క్రమంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ పుట్టినరోజు కానుకగా ఆయన పాత్రకు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ వదిలగా.. మంచి స్పందన తెచ్చుకుంది. చరణ్ ని అగ్నిలో, తారక్ ను నీటిలో చూపించిన జక్కన్న.. అజయ్ దేవగన్ ని ఇసుక నేపథ్యంలో చూపించారు. దీంతో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ చూపించబోయే రుధిరం ఎలా ఉండబోతోందో అని ఇప్పటి నుంచే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తారక్ ను గోండ్రు బెబ్బులిగా పరిచయం చేసిన రాజమౌళి.. మే 13న ఎన్టీఆర్ బర్త్ డేకి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వడబోతున్నాడని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.