శిష్యుడ్ని పైకి లేపుతున్న జ‌క్క‌న్న‌!

Update: 2022-08-18 10:38 GMT
ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి సినిమా అంటే భారీ స్పాన్ తో కుడున్న‌ది. అత‌ని వ‌ద్ద ఎంతో మంది స‌హాయ‌కులుంటారు. 24 శాఖ‌ల్ని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ రాజ‌మౌళి ఎంతో? పక‌డ్భందీగా సినిమా పూర్తిచేస్తారు.  అందుకోసం జ‌క్క‌న్న త‌న కుటుంబ స‌భ్యుల్నే ఓ టీమ్ గా ఏర్పాటు చేసి ఆయా బాధ్య‌త‌లు వాళ్ల‌కి అప్ప‌గిస్తుంటారు. జ‌క్క‌న్న కూడా కొంత మంది రెగ్యుల‌ర్ అసిస్టెంట్స్ ఉంటారు.

ఇప్ప‌టికే జ‌క్క‌న్న ఎన్నో సినిమాలు చేసారు. కానీ ఆయ‌న కాంపౌండ్ నుంచి  బ‌య‌ట‌కు వ‌చ్చి ద‌ర్శ‌కులైంది మాత్రం చాలా త‌క్కువ అన్ని అభిప్రాయం ఫిలిం స‌ర్కిల్స్ లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ప‌ని వాతావ‌ర‌ణం బాగుంటుంద‌ని ఆయ‌న వ‌ద్దే స్టిక్ అవుతారా? ఇంకేవైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది పక్క‌న‌బెడితే ఇండ‌స్ర్టీలో జ‌క్క‌న్న వ‌ద్ద ప‌నిచేసి ద‌ర్శ‌కులైంది మాత్రం త‌క్కువ‌ని తెలుస్తోంది.

ఆ మ‌ధ్య 'ఆకాశ‌వాణి' అనే సినిమాతో అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇత‌ను  జ‌క్క‌న‌న్న శిష్యుడే. ఆకాశ‌వాణి విమర్శ‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలో రాజ‌మౌళి బాగానే ప్ర‌చారం చేసిన‌ట్లు క‌నిపించింది. ఆయ‌న‌తో పాటు తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా త‌న వంతు స‌హ‌కారం అందించారు.

తాజాగా ఈ యంగ్ మేక‌ర్ కోసం విజ‌యేంద్ర ప్ర‌సాద్ నే క‌థ అందించిన‌ట్లు తెలుస్తోంది.  అశ్విన్ '1770' అనే సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.  ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు..త‌మిళం..హిందీతో పాటు మ‌ల‌యాళం..క‌న్న‌డ భాష‌ల్లో కూడా విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే ఈసినిమా క‌థ‌ని విజ‌యేంద్రుడు ప్ర‌ముఖ క‌వి  ఆనంద్ మ‌ఠ్ న‌వ‌ల 'వందేమాతరం' ఆధారంగా ర‌చించారు.

వందేమాత‌రం గీతం ర‌చించి 150 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలిపారు.నాటి కాలంలోకి తీసుకెళ్లే దృశ్యాలు..భావోద్వేగాలు..యాక్ష‌న్ అంశాలు వేళ‌వింపుతో చిత్రం తెర‌కెక్క‌నుంది.  కాన్సెప్ట్ స‌మ‌కూర్చుతున్న  రామ్ క‌మ‌ల్ ముఖ‌ర్జీ విజన్ నాలో న‌మ్మ‌కాన్ని పెంచింది.

జాతినంత‌టిని  ఏకం చేసి అన్యాయానికి వ్య‌తిరేకంగా పోరాడేలా చేసింది వందేమాత‌రం గీతం. 1779లో స్వాతంత్ర్య స‌మ‌రం కోసం మొయిన ప్రాంతంలో స్ఫూర్తిని ర‌గిలించిన యోధులెంతో మంది ఉన్నారు. వాళ్లంద‌రి గురించి ఈ చిత్రం తెలియ‌జేస్తుంద‌'న్నారు విజ‌యేంద్ర ప్ర‌సాద్.  ఇలా రాజమౌళి కుటుంబ స‌భ్యులు ఓ శిష్యుడ్ని ఇంత‌లా  ప్రోత్స‌హించడం ఇదే తొలిసారి కావొచ్చు.
Tags:    

Similar News