2005 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాజమౌళి తీసుకు వచ్చిన చిత్రం చత్రపతి. ఆ సమయంలోనే చత్రపతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్ కెరీర్ లో అప్పటి వరకు అతి పెద్ద విజయంగా నిలిచింది. రాజమౌళి మేకింగ్ అద్బుతం అంటూ ఆ సమయంలోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సినిమా చత్రపతి. ఆ సినిమా కథ మరియు కథనం అద్బుతం అంటూ ప్రతి ఒక్కరి నుండి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు చత్రపతిని హిందీలో వివి వినాయక్ రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. గత కొన్ని నెలలుగా ఈ రీమేక్ గురించిన ప్రచారం పెద్ద ఎత్తున బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు జరుగుతుంది.
ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.. తాను కాని శ్రీనివాస్ కాని ఈ సినిమాను చేయాలని అనుకోలేదు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ వారు బెల్లంకొండ కు అక్కడ ఉన్న క్రేజ్ నేపథ్యంలో అతడితో రీమేక్ చేస్తే బాగుంటుందని భావించారు. ఇక దర్శకుడిగా నన్ను ఎంపిక చేసుకున్నారు. నాకు సింహాద్రి సినిమా రీమేక్ చేయాలనే కోరిక కాని చత్రపతి సినిమా నా వద్దకు వచ్చింది. చత్రపతి సినిమా రీమేక్ తప్పకుండా హిందీలో ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తామనే నమ్మకంను వినాయక్ వెళ్లడించారు.
ఇక చత్రపతి హిందీ వర్షన్ కోసం పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు గాను వినాయక్ ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ను కలిశారట. ఆయన కు బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన అనుభవం ఉంది. అందుకే ఆయన్ను ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో సహకారం కోరాం. ఇక రాజమౌళితో కూడా చర్చించాల్సి ఉంది. ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా పనులతో బిజీగా ఉండటం వల్ల కలవడం కుదరలేదు. ఆయన్ను త్వరలోనే కలుస్తామని ఈ సందర్బంగా వినాయక్ అయ్యాడు. రాజమౌళి సలహాలు మరియు సూచనలు కూడా తీసుకున్న తర్వాత చత్రపతి హిందీ ని అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కిస్తామంటూ వినాయక్ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ లో వినాయక్ మరియు బెల్లంకొండలకు మొదటి సినిమా అవ్వడం వల్ల ఫలితం ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.