ఏదైనా ఒక సమస్య చర్చనీయాంశంగా మారితే ఎవరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా సినిమా వాళ్లు మాత్రం తప్పకుండా పట్టించుకుంటారు. రచయితలు దర్శకులు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడదా అని ఓ రెండు లైన్లు రాసిపెట్టుకొని ఉంటారు. అయితే అదే తరహాలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు జల్లి కట్టు గురించి ఇప్పుడు ఒక సినిమాను తీయడానికి రెడీ అయ్యారు. శివ కార్తికేయన్ ఆ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు.
జల్లి కట్టు వివాదం దాదాపు ఒక ఏడాది వరకు ఎంతో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కానీ జల్లి కట్టు వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అలాగే ముగ జంతువులను హింసిస్తున్నారని న్యాయస్థానం మొదట నిషేదించగా.. తమిళనాడు మొత్తం దద్దరిల్లింది. సాంప్రదాయం ప్రకారం వస్తోన్న ఆనవాయితీని ఎలా నిషేదిస్తారని తమిళనాడు మెరీనా బీచ్ మొత్తం వద్ద నిరసనకు దిగింది. దీంతో మళ్లీ నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. జల్లికట్టుకు సినీ హీరోలు రాజకీయ నాయకుల మద్దతు కూడా బాగానే లభించింది.
ఇకపోతే ఇప్పుడు దర్శకుడు ఎమ్.ఎస్ రాజా ఆ నేపథ్యంలో కథను రెడీ చేసుకొని తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు. మెరీనా పిరచ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశాడు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అయితే రీసెంట్ హీరో శివకార్తికేయన్ సినిమా పోస్టర్ లుక్ ని రిలీజ్ చేసి త్వరలో ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. ఇక సినిమాపై ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. మరి సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.