SSMB 29.. ఆ రెండు చోట్ల అసలు షూటింగ్!
అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న SSMB 29కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి అండ్ టీమ్ బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటిస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా, రాజమౌళి వీడియోను ఇటీవల షేర్ చేయడంతో మూవీ షూటింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. దీంతో ఆ పోస్టుకు ఇప్పటికే మీమ్స్, ఫన్నీ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఒకట్రెండు షెడ్యూల్స్ తర్వాత మూవీ డిటైల్స్ ను జక్కన్న షేర్ చేసుకుంటారని సమాచారం.
అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న SSMB 29కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి అండ్ టీమ్ బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్యాస్టింగ్ డిటైల్స్ బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు సమాచారం. టీమ్ అందరితో నాన్- డిస్ క్లోజ్ అగ్రిమెంట్ చేయించారని ప్రచారం జరుగుతోంది. ఫోన్స్ ను కూడా అనుమతించడం లేదని టాక్.
దీంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్ లో షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు మూడు చోట్ల కూడా సెట్స్ రెడీ చేశారని వినికిడి.
అయితే గతంలో రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన సెట్స్ లో రాజమౌళి షూటింగ్స్ ఎక్కువగా నిర్వహించేవారు. ఇప్పటికే అక్కడ బాహుబలి సెట్ ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరిపేందుకు ఆయన మొగ్గు చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. జక్కన్న గత మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా అక్కడ జరిగింది.
ఇప్పుడు SSMB 29 చిత్రీకరణ కూడా అక్కడే నిర్వహిస్తున్నారు రాజమౌళి. అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు కెన్యా అడవుల్లో కూడా షూట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే రాజమౌళి అక్కడికి వెళ్లి చూసి.. లొకేషన్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అమెజాన్ అడవులు బ్యాక్ డ్రాప్ తో సినిమా ఉండనుందని కొద్ది రోజుల క్రితం విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే.