అంతిమయాత్రలో పాడె మోసిన నటుడు రానా

పశ్చిమగోదారి జిల్లాలోని తణుకు పట్టణానికి వచ్చారు సినీ నటుడు రానా. అక్కడ తన అమ్మమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న రానా.. ఆమె పాడెను మోశారు.

Update: 2025-01-30 04:40 GMT

పశ్చిమగోదారి జిల్లాలోని తణుకు పట్టణానికి వచ్చారు సినీ నటుడు రానా. అక్కడ తన అమ్మమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న రానా.. ఆమె పాడెను మోశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే.. దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి భార్య రాజేశ్వరి దేవి మరణించారు. ఆమె అంత్యక్రియలు బుధవారం తణుకు పట్టణంలో జరిగాయి.

రాజేశ్వరీదేవి రానాకు స్వయాన అమ్మమ్మ. రానా తండ్రి దగ్గుపాటి సురేష్ కు స్వయంగా అత్తగారు. చిన్నతనంలో రానాను ఆమె చూసుకునేవారు. అమ్మమ్మ అంటే రానాకు చాలా ఇష్టం. దీంతో..ఆమె మరణం గురించి తెలుసుకున్న రానా తణుకు వెళ్లి.. అంతిమయాత్రలో అమ్మమ్మ పాడెను మోసిన వైనం అందరిని కదిలించింది. అంత పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నప్పటికి.. బాల్యంతో తనను చూసిన అమ్మమ్మతో తనకున్న అనుబంధానికి గుర్తుగా వ్యవహరించిన తీరును కొనియాడారు.

Tags:    

Similar News