శృతిని పెళ్లి చేసుకోమంటున్న ఫ్యాన్స్

త‌న‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపిన ఫ్యాన్స్ కు, వెల్ విష‌ర్స్ కు శృతి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తూ ఓ నోట్ ను రిలీజ్ చేసింది.

Update: 2025-01-30 05:32 GMT

క‌మల్ హాస‌న్ వార‌సురాలిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన శృతి హాస‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. తండ్రి వ‌ల్ల ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ అమ్మ‌డు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ మొద‌ట్లో ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డ్డ శృతి త‌క్కువ టైమ్ లోనే సౌత్ లో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

మొన్న జ‌న‌వ‌రి 28న శృతి పుట్టిన‌రోజు. ఈ ఇయ‌ర్ శృతి 39వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టింది. త‌న‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపిన ఫ్యాన్స్ కు, వెల్ విష‌ర్స్ కు శృతి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తూ ఓ నోట్ ను రిలీజ్ చేసింది. ఆ నోట్ లో 2025 మెమ‌ర‌బుల్ ఇయ‌ర్ అని, నేను దాన్ని ఫీల‌వుతున్నాన‌ని శృతి ఈ సంద‌ర్భంగా తెలిపింది.

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, లోకేష్ క‌న‌గ‌రాజ్ క‌ల‌యిక‌లో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో శృతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమా సెట్స్ లోనే కూలీ చిత్ర యూనిట్ తో క‌లిసి శృతి త‌న పుట్టినరోజును సెల‌బ్రేట్ చేసుకుంది. కూలీ కాకుండా త‌న చేతిలో ట్రైన్ అనే మ‌రో త‌మిళ సినిమాతో పాటూ స‌లార్2లో కూడా శృతి న‌టించ‌నుంది.

2025 మెమొర‌బుల్ ఇయ‌ర్ అని థాంక్స్ నోట్ లో చెప్పిన శృతికి కొంత‌మంది ఆమె ఫ్యాన్స్, ఈ ఇయ‌ర్ ను మ‌రింత మెమొర‌బుల్ చేయ‌డానికి పెళ్లి చేసుకోమ‌ని చెప్పారు. 40వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టే లోపే పెళ్లి చేసుకోమ‌ని శృతికి ఆమె ఫ్యాన్స్ స‌ల‌హాలు ఇస్తున్నారు. కానీ త‌న‌కు పెళ్లి మీద పెద్ద‌గా న‌మ్మ‌కం లేద‌ని శృతి గ‌తంలోనే తెలిపింది.

Tags:    

Similar News