వీడియో : జల్సా సందడి.. బాబోయ్‌ ఇది మరో లెవల్‌

Update: 2022-08-30 14:36 GMT
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా జల్సా సినిమాను భారీ ఎత్తున స్క్రీనింగ్ చేసేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. దాదాపుగా 500 స్క్రీన్స్ ల్లో జల్సా సినిమాను అభిమానులు పండుగ మాదిరిగా ఎంజాయ్‌ చేస్తూ చూడబోతున్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జల్సా స్క్రీనింగ్‌ కు సిద్ధం అయ్యారు.

ఈ మధ్య కాలంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ను ఆయన బర్త్‌ డే సందర్భంగా స్క్రీనింగ్‌ చేసిన విషయం తెల్సిందే. చిరంజీవి బర్త్‌ డే కి ఘరానా మొగుడు సినిమాను వేశారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్ బర్త్‌ డే కి జల్సా ను అభిమానుల కోసం ప్రదర్శించబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రతి స్క్రీన్‌ లో కూడా అద్భుతంగా సినిమా కి రెస్పాన్స్ ఉంది.

చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన సినిమా ను పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడం అంటే ఏదో అల్లాటప్పగా విడుదల చేయడం కాకుండా సౌండ్ సిస్టమ్‌ లో మార్పు చేయడంతో పాటు కలరింగ్ కరక్షన్స్ చేసి ఇంకా ఎంతో టెక్నాలజీని ఉపయోగించి ఈతరం ప్రేక్షకుల కోసం అన్నట్లుగా టెక్నికల్‌ హంగులు అద్ది మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

జల్సా సినిమా ఫ్యాన్స్ షో కోసం ప్రత్యేకంగా ట్రైలర్‌ ను కూడా కట్‌ చేయించారు. గీతా ఆర్ట్స్‌ వారు ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది. జల్సా ట్రైలర్‌ పూర్తిగా మహేష్ బాబు వాయిస్ ఓవర్‌ తో సాగింది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ ను ఇప్పటి ప్రేక్షకుల కోసం చాలా ఆసక్తికరంగా మార్చి మళ్లీ యూట్యూబ్‌ ద్వారా గీతాఆర్ట్స్ వారు విడుదల చేయడం జరిగింది. మొత్తానికి జల్సా సందడి మరో లెవల్‌ అనేందుకు ఈ ట్రైలర్‌ ప్రత్యక్ష సాక్ష్యం అనడంలో సందేహం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News