కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత హఠాత్ మరణం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు మరియు ఆయన అభిమానులకు తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆయన మరణం పై సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు శ్రద్ధాంజలి ఘటించారు. పునీత్ రాజకుమార్ చనిపోయే సమయంలో రెండు సినిమాలను చేస్తున్నారు. అందులో ఒకటి జేమ్స్. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన పునీత్ రాజ్ కుమార్ కరోనా వల్ల విడుదల లేట్ చేస్తూ వచ్చాడు.
పునీత్ రాజకుమార్ చనిపోయిన తర్వాత జేమ్స్ చిత్ర యూనిట్ సభ్యులు ఆ సినిమాను భారీగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించారు. అందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. పునీత్ రాజ్ కుమార్ డబ్బింగ్ పూర్తి చేయక పోవడంతో పాత్రకు ఆయన అన్న శివ రాజ్ కుమార్ తో డబ్బింగ్ చెప్పించారు.
శివ రాజ్ కుమార్ కేవలం డబ్బింగ్ మాత్రమే చెప్పకుండా జేమ్స్ సినిమాలో గెస్ట్ పాత్ర లో కూడా కనిపించని సమాచారం అందుతోంది. సినిమా విడుదలకు ముందు నుండే హడావుడి నెలకొంది. సినిమా భారీ ఎత్తున కర్ణాటక రాష్ట్రంలో విడుదల అయ్యింది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా కన్నడ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. మరే సినిమా కూడా జేమ్స్ కు పోటీ లేకుండా విడుదల చేయడంతో భారీ ఓపెనింగ్స్ దక్కాయి.
సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా దాదాపుగా 27 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కర్ణాటకలో ఒక కన్నడ సినిమా ఈ స్థాయిలో వసూలు చేయడం ఇదే మొదటి సారి అంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జేమ్స్ చిత్రం నెవ్వర్ బిఫోర్ వసూళ్లను దక్కించుకోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జేమ్స్ సినిమా థియేటర్ల వద్ద మొదటి వారం రోజుల పాటు సందడి వాతావరణం నెలకొంటుంది అంటూ పునీత్ అభిమానులు తెలియజేశారు. ఎక్కడికక్కడ థియేటర్ల వద్ద అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశామని వారు చెబుతున్నారు.
రాష్ట్రం మొత్తం ముఖ్యంగా బెంగళూరు సిటీ మొత్తం కూడా సినిమా విడుదల సందర్భంగా పునీత్ యొక్క ఫ్లెక్సీ లను భారీగా ఏర్పాటు చేయడంతో మరో సారి పునీత్ రాజ్ కుమార్ ని కన్నడ రాజ్యం తలచుకొని కన్నీరు పెట్టుకుంది. అప్పు లేని లోటును ఏ ఒక్కరు తీర్చలేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేజీఎఫ్ రేంజ్ వసూళ్లను జేమ్స్ కు ఇవ్వబోతున్నట్లుగా మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.