సీనియర్ నటి జమున ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. హైదరాబాద్ తొలి హీరోయిన్ తానే అని ఆమె ప్రకటించారు. ఐతే కర్ణాటకలోని హంపిలో పుట్టి.. గుంటూరు జిల్లా తెనాలిలో పెరిగిన ఆమె తొలి హైదరాబాద్ హీరోయిన్ ఎలా అవుతుంది అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఐతే దీని వెనుక మతలబు ఏంటో ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
‘‘తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి తామే కారణమని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ 1959లోనే ఇక్కడ సారథి స్టూడియోస్ కట్టారు. ఆ సంస్థ నిర్మించిన తొలి సినిమా ‘మా ఇంటి మహాలక్ష్మి’ సినిమాలో నేనే కథానాయిక. ఆ తర్వాత నేను అదే సంస్థలో ‘పెళ్లి కాని పిల్లలు’.. ‘జల్సారాయుడు’ సినిమాల్లోనూ నటించాను. ఆ రకంగా చూస్తే తొలి హైదరాబాద్ హీరోయిన్ నేనే. అప్పట్లో హైదరాబాద్ ఒక అడవిలాగే ఉండేది’’ అని జమున చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి అక్కినేని నాగేశ్వరరావే కారణం అంటారు అందరూ. ఆయన కూడా ఆ విషయాన్ని చెప్పుకుంటారు. జమున ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. అక్కినేనికి మాటలకు కౌంటర్ లాగే అనిపిస్తున్నాయి. అక్కినేనికి.. జమునకు అప్పట్లో పడేది కాదని అంటారు. ఈ మాటల్ని బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది.