మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎట్టకేలకు నోరు విప్పారు. బాబాయ్ పవన్ కళ్యాన్ జనసేన పార్టీ గురించి స్పందించారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటూ కాలికి గాయం కావడంతో ప్రస్తుతం చరణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఖాళీ సమయంలో జనసేన, పవన్ గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా రాంచరణ్ పంచుకున్నారు.
రాంచరణ్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో జనసేన మేనిఫెస్టో గురించి స్పందించాడు. ‘అద్భుతమైన మేనిఫెస్టోను జనసేన రూపొందించింది. దీంట్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయాల్లో సరికొత్త తరంగం.. కళ్యాణ్ బాబాయ్ కి కంగ్రాట్స్. జనసేన పార్టీ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’ అంటూ చరణ్ రాసుకొచ్చాడు.
మెగా హీరోలు ఎవ్వరూ జనసేనపై స్పందించడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాంచరణ్ ముందుకొచ్చి ఈ కామెంట్స్ చేయడంతో వైరల్ అయ్యింది.
జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల్లో ఒంటరిగా పోరాడుతున్నారు. ఇటీవలే సోదరుడు నాగబాబుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించేందుకు పవన్ పాటుపడుతున్నాడు. వీరిద్దరికి మద్దతుగా మెగా హీరోలు వస్తారని ప్రచారం జరిగినా ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. బాబాయ్ కోరితే జనసేన తరుఫున ప్రచారం చేస్తానని అన్న రాంచరణ్ ఇప్పుడు ప్రచారానికి మాత్రం రావడం లేదు. అయితే ఫేస్ బుక్ ద్వారా తన మద్దతును ప్రకటించారు.