‘జనతా గ్యారేజ్’ జోరు మామూలుగా లేదు. తొలి వారాంతంలోనే రూ.50 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ సినిమా.. చవితి సెలవు తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది. మంగళ.. బుధవారాల్లో సైతం సినిమాకు పర్వాలేదనిపించే కలెక్షన్లు వచ్చాయి. మేజర్ డ్రాప్ ఏమీ లేదు.
ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో ఆల్రెడీ నాన్-బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న ‘జనతా గ్యారేజ్’.. తొలి వారం కలెక్షన్లలోనూ రికార్డు కొట్టింది. ‘శ్రీమంతుడు’ రూ.57 కోట్లతో తొలి వారం నాన్-బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకోగా.. ‘జనతా గ్యారేజ్’ దాని కంటే రూ.5 కోట్లు ఎక్కువగా.. అంటే రూ.62 కోట్లతో రికార్డు బద్దలు కొట్టింది. ‘శ్రీమంతుడు’ ఫుల్ పాజిటివ్ టాక్ తో ఆ కలెక్షన్లు సాధించగా.. ‘జనతా గ్యారేజ్’ డివైడ్ టాక్ తోనూ దాన్ని దాటేయడం విశేషం.
ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’ ఫుల్ రన్ కలెక్షన్లను దాటేసి ఆల్ టైం తెలుగు హైయెస్ట్ గ్రాసర్స్ లిస్టులో ఆరో స్థానానికి చేరుకుంది ‘జనతా గ్యారేజ్’. ఆ సినిమా ఇంకో రెండు స్థానాలు ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేసుగుర్రం రూ.70 కోట్లు.. మగధీర రూ.75 కోట్ల షేర్ తో ‘జనతా గ్యారేజ్’ కన్నా ముందున్నాయి. రెండో వారాంతంలో బాగా పెర్ఫామ్ చేయగలిగితే.. వీటిని దాటేయడం సాధ్యమే. మరి ‘గ్యారేజ్’ ఎక్కడిదాకా వెళ్తుందో చూద్దాం.