నందమూరి అభిమానుల సందడికి ముహూర్తం దగ్గర పడింది. ఈ రోజే ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక. రాత్రి హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా ఈ వేడుక చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఆడియో మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఆడియో ట్రాక్ లిస్టు ఒక రోజు ముందే బయటికి వచ్చింది. తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం ఇందులో ఆరు పాటలున్నాయి. శ్రీమంతుడు.. నాన్నకు ప్రేమతో సినిమాల్లో అదిరిపోయే పాటలు పాడిన రఘు దీక్షిత్ తో ఇందులోనూ.. రాక్ ఆన్ బ్రో అంటూ ఓ పాట పాడించాడు దేవిశ్రీ ప్రసాద్.
అలాగే శ్రీమంతుడులో ‘చారుశీల’ పాట పాడిన యాజిన్ నజీర్ యాపిల్ బ్యూటీ అంటూ సాగే పాటను నేహా బాసిన్ తో కలిసి ఆలపించాడు. శంకర్ మహదేవన్ కూడా ఇందులో ఓ పాట పాడటం విశేషం. ప్రణామం.. అంటూ సాగుతుందా పాట. చాలా ఏళ్ల పాటు తెలుగులో పాటలు పాడని శంకర్ మహదేవన్ తో దేవిశ్రీ పాడించి ఆశ్చర్యపరిచాడు. ఇంకా ఆడియోలో జయహో జనతా అంటూ సాగే ఇంకో పాటను సుఖ్విందర్ సింగ్.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. ఇవి కాక నీ సెలవడిగి.. నేను పక్కా లోకల్.. అనే పదాలతో మొదలయ్యే రెండు పాటలున్నాయి. మరి ఈ పాటలు ఎలా ఉంటాయో ఈ రోజు రాత్రికి తేలిపోతుంది. దేవిశ్రీ.. కొరటాలతో.. ఎన్టీఆర్ తో ఇంతకుముందు చేసినవన్నీ మ్యూజికల్ హిట్లే. మరి ‘జనతా గ్యారేజ్’ ఆడియో రేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం.