గ్యారేజ్ తో మహేష్ ని దాటేసిన జూనియర్

Update: 2016-09-01 12:49 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. సమంత-నిత్యా మీనన్ లు హీరోయిన్ లుగా నటించిన జనతా గ్యారేజ్ థియేటర్లలోకి వచ్చేసింది. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంపై ముందు నుంచి చాలానే అంచనాలు ఉండగా.. రికార్డులు తిరగరాసేస్తుందని అభిమానులు గట్టిగానే నమ్మారు.

ఇప్పుడు జనతా గ్యారేజ్ యూఎస్ కలెక్షన్స్ కి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. కేవలం ప్రీమియర్లతోనే హాఫ్ మిలియన్ మార్క్ దాటేశాడు జూనియర్. తన కెరీర్ బెస్ట్ స్థాయిలో.. ప్రీమియర్లతో 560k డాలర్లను రాబట్టాడు. ఎన్టీఆర్ కి ఇది చాలా పెద్ద రికార్డ్ అనాల్సిందే. ఎందుకంటే ఓవర్సీస్ లో మాంచి స్ట్రాంగ్ గా ఉండే మహేష్ కి కూడా ఇంత పెద్ద మొత్తం తెచ్చిపెట్టిన సినిమా లేదు. జనతా గ్యారేజ్ మహేష్ మూవీస్ ని అధిగమించినా.. పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ ని దాటలేకపోయింది.

సర్దార్ గబ్బర్ సింగ్ కు ప్రీమియర్ల ద్వారా 615k డాలర్లు రాగా.. గ్యారేజ్ 560k డాలర్ల దగ్గరే ఆగిపోయింది. ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల కోసం 7.2 కోట్ల రూపాయలు చెల్లించడంతో.. డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లోకి వచ్చేందుకు ఇంకా చాలా మొత్తమే రాబట్టాల్సి ఉంటుంది. కనీసం 2మిలియన్లను కలెక్ట్ చేసే మూవీగా అంచనా వేసినా.. మాస్ సినిమాలను పెద్దగా ఆదరణ లభించని ఈ జోన్ లో.. టాక్ అంత గొప్పగాలేని గ్యారేజ్.. ఆ ఫీట్ సాధించడం కష్టం కావచ్చంటున్నారు ట్రేడ్ జనాలు.

Tags:    

Similar News