అక్కడ జనతా గ్యారేజ్ ఈ రోజే రిలీజ్

Update: 2016-09-04 11:30 GMT
రజినీకాంత్ అంటే జపాన్ అభిమానులు పడి చస్తారన్న సంగతి తెలిసిందే. అక్కడ రజినీ స్థాయిలో కాకపోయినా మన జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ప్రతి సినిమా జపాన్ లో విడుదలవుతోంది. ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ స్పాట్ కు కూడా కొందరు జపాన్ అభిమానులు రావడం.. ఎన్టీఆర్ ను కలిసి ఫొటోలు దిగడం గుర్తుండే ఉంటుంది. జపాన్లో తారక్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ‘జనతా గ్యారేజ్’ను కూడా అక్కడ రిలీజ్ చేశారు. ఐతే సెప్టెంబరు 1న అక్కడ విడుదల చేయడం కుదర్లేదు. ఆదివారమే అక్కడ సినిమా రిలీజైంది. ఓపెనింగ్స్ బాగానే వస్తాయని ఆశిస్తున్నారు. రిలీజ్ కూడా కొంచెం పెద్ద స్థాయిలోనే చేశారు. స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసింది.

మరోవైపు ‘జనతా గ్యారేజ్’ ఓవర్సీస్ లో దుమ్ము దులుపుతోంది. దాదాపు 30 దేశాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. యూఏఈలో ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమాకూ లేని స్థాయిలో 42 స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. ప్రిమియర్లు కూడా భారీగా వేశారు. కలెక్షన్లు అంచనాలకు తగ్గట్లే వచ్చాయి. అమెరికాలో ఈ సినిమాకు అద్భుత స్పందన వస్తోంది. మూడో రోజుకే మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టిన ఈ చిత్రం 2 మిలియన్ క్లబ్బులోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News