జనతా గ్యారేజ్ టార్గెట్ పెద్దదే!!

Update: 2016-09-01 11:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. బెనిఫిట్ షోల నుంచి ఆడియన్స్ హంగామా బాగా ఎక్కువగా కనిపిస్తోంది. మొదటి రోజు రికార్డులకు గురి పెట్టిన ఎన్టీఆర్.. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ డే బుకింగ్స్ పూర్తి చేసుకున్నాడు. అయితే.. జనతా గ్యారేజ్ ముందు చాలా పెద్ద టార్గెట్ కనిపిస్తోంది.

జనతా గ్యారేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా.. తెలుగు మలయాళ వెర్షన్లకు కలిపి 80.7 కోట్ల రూపాయలు. నైజాంలో ఈ చిత్రాన్ని 15.3 కోట్లకు విక్రయించగా.. సీడెడ్ లో 9కోట్లు పలికింది. వైజాగ్ 5.12 కోట్లు.. ఈస్ట్ 4.23 కోట్లు - వెస్ట్ 3.30 కోట్లు.. గుంటూరు-కృష్ణాలకు కలిపి 8.34 కోట్లు.. నెల్లూరు 2.34 కోట్లు.. టోటల్ గా చూసుకుంటో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోే 47.63 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక కర్నాటక నుంచి 7.02 కోట్లు.. కేరళ 4.20కోట్లు(శాటిలైట్ తో కలిపి) తమిళనాడు 70లక్షలు.. రెస్టాఫ్ ఇండియా 60 లక్షలు.. ఓవర్సీస్ నుంచి 7.25 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. శాటిలైట్ రూపంలో 12.5 కోట్లు రాగా.. ఆడియో-డిజిటల్ రైట్స్ రూపంలో మరో 80 లక్షలు వచ్చాయి.

మొత్తంగా జనతా గ్యారేజ్ 80.7 కోట్ల బిజినెస్ చేయగా.. ఇప్పుడు థియేటర్ల నుంచి 67.4 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రింట్స్ ఖర్చులు కలుపుకుంటే కనీసం 70 కోట్ల బిజినెస్ చేస్తేనే ఇది సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఎన్టీఆర్ హీరోయిజం.. కొరటాల ట్రాక్ రికార్డ్.. సమంత అందాలు.. నిత్యా మీనన్ నటన.. కాజల్ ఐటెం సాంగ్.. ఎట్రాక్షన్స్ కు తక్కువ లేదు కానీ.. రిజల్ట్ సంగతి తెలియాలంటే మాత్రం వీకెండ్ ముగిసే వరకూ ఆగాల్సిందే.
Tags:    

Similar News